#


Index

ఉపసంహారము

  గీతాజ్ఞాన యజ్ఞ మిప్పటికి సమాప్త మయింది. జ్ఞాన యజ్ఞమే చేయండి అదే మోక్షానికి సాధనమని బోధించాడు భగవానుడు మనకు. ద్రవ్యయజ్ఞాలు కావు. జపయజ్ఞాలు కావు. తపో యజ్ఞాలు కావు. అవన్నీ భౌతికమైన యజ్ఞాలు. భగవత్పాదులు యజ్ఞమనేది నాలుగు విధాలని చెప్పారు. ఒకటి విధి యజ్ఞం. ఇది శారీరకం. రెండు జపయజ్ఞం ఇది వాచికం - మూడూ ఉపాంశు యజ్ఞం. ఇదీ వాచికమే. జపం పదిమందికీ వినిపించే దయితే ఇది దగ్గరి వాడికి మాత్రమే వినిపించేది. అంత మాత్రమే. పోతే కడపటిది మానసికం. ఇదే జ్ఞాన యజ్ఞం. అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనదని ప్రశంసించారాయ.

  ఏదైనా మానవుడు తన మనసుతోనే గదా సాధించవలసింది. సంకల్పించేది మనసే. స్వానుభవానికి తెచ్చుకొనేదీ మనసే. బ్రహ్మానుభవమైనా సరే. చివరకను భవానికి రావలసింది మనసుకే. ఎటు వచ్చీ అది అఖండమూ అద్వితీయమూ కాబట్టి ఆపాటికి మనసు ఆత్మాకారంగా మారిపోతుంది. అంత మాత్రమే. ఇలాటి మహాద్భుతమైన జ్ఞాన యజ్ఞమే సాంఖ్యం మొదలు సన్య్యాసం వరకూ అన్ని అధ్యాయాలలోనూ అనేక మార్గాలలో బోధిస్తూ వచ్చింది భగవద్గీత మనకు.

Page 538

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు