నడిపే నీతీ భావమనే భూతీ - ఈశ్వర భావంతో మరలా ఈ విశ్వ ప్రపంచాన్నీ ఇవి రెండూ ఆముష్మిక జీవితానికి అతనికి లభించే మహాఫలం. అంటే ప్రవృత్తి నివృత్తి సుఖాలు రెండూ వాటి పాటికవే సంప్రాప్తిస్తాయని భావం. ఇంతకన్నా కావలసిన పురుషార్థ సిద్ధి ఏముంది మానవుడికి. సర్వమూ సిద్ధించినట్టే. సర్వమూ అనుభవించినట్టే. ఇదే పరిపూర్ణానుభవం మానవుడికి. నిరుపద్రవమైన నిత్య సుఖానుభవం.
ఇతి
మోక్ష సన్న్యాస యోగః సమాప్తః
Page 537