#


Index

మోక్ష సన్న్యాస యోగము

  యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడెక్కడ ఉంటాడో ధనుర్ధారి అయిన పార్థుడెక్కడ ఉంటాడో అక్కడ మనకు లభించని కోరిక అంటూ ఏముంటుంది. యోగేశ్వరుడనటం వల్ల సచ్చిద్రూపంగా పరమాత్మ సర్వవ్యాపకమై ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడనే గొప్ప రహస్యం బోధిస్తున్నాడు. అయితే వస్తుసిద్ధంగా అది ఉన్నా దాన్ని దర్శించే తాకత్తుండాలి మానవుడికి. అదే ధనుర్ధరుడనే మాటలో పార్ధుడనే మాటలో వ్యంగ్యంగా సూచిస్తున్నాడు. పార్ధుడంటే పృథ కుమారుడైన అర్జునుడనే గాక పృథివీ కుమారులైన మానవులందరూ పార్థులే. కాని ధనుర్ధారి అయిన మానవుడెవడో ఒక్కడుంటాడు. ధనుర్ధరత్వమంటే ఏకాగ్రమైన దృష్టి లేదా ఆత్మాకారమైన వృత్తి అని అంతరార్థం. అలాటి వాడైతే మానవుడు పరమాత్మ అనుగ్రహానికి తప్పకుండా పాత్రుడు కాగలడు. అప్పుడా పరమాత్మ తప్పకుండా కృష్ణుడే. అంటే కర్షతీతి కృష్ణః సంసార సాగరం నుంచి పైకి లాగి బయటపడే మార్గం చూపగలడు. అదే యోగమంటే బ్రహ్మ జ్ఞాన రహస్యం.

  అది ఈ సాధకుడందు కొంటే ఇక ఏది సమకూరదు. శ్రీ విజయాలూ ఒనగూడుతాయి. భూతి నీతులూ సమకూరుతాయి. సిరిసంపదలూ అపజయంలేని కార్యసాఫల్యమూ ఐహిక జీవితానికి కావలసినదైతే బ్రహ్మ

Page 536

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు