#


Index

మోక్ష సన్న్యాస యోగము

పరవశమై పోతున్నదని తన అనుభవాన్ని వ్యక్తం చేస్తాడు. దీన్ని బట్టి సంజయుడెవడో వాడెంత వాడో మనకర్థ మవుతున్నది. ఆ క్షత్రియ వంశంలోని వాడు కాడతడు. రాజుగారికి సన్నిహితుడైన ఒక సేవకుడు. అయినప్పటికీ మహాభారతంలో అతని కున్న స్థాన మెవరికీ లేదు. ఒక విధంగా విదురడంత వాడు. శూద్రకుల జాతుడైనా అశూద్రమైన ప్రజ్ఞ అతనిది. లేకుంటే వ్యాస ప్రసాదానికి పాత్రుడవుతాడా. అర్జునుడు తప్ప అక్కడ ఎవరికీ అంతుపట్టని విశ్వరూప మదేపనిగా దర్శించగలడా. అంతేగాక పరమాత్మ బోధా ఆయన విభూతీ మాటి మాటికీ మననం చేసి మనసుకు పట్టించుకోగలడా. ఉత్తమాధికారి లక్షణమిలాగే ఉంటుంది మరి.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః
తత్ర శ్రీర్విజయో భూతి - ర్ధువా నీతిర్మతి ర్మమ - 78

  పోతే ఇక ఆఖరిసారిగా చిరస్మరణీయమైన ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు సంజయుడు. ఒక విధంగా ఇది గీతా శాస్త్ర ఫల శ్రుతి అనుకోవచ్చు. మానవుడికి ఐహికాముష్మిక జీవితాలకు రెండింటికీ కావలసిన ఫలసిద్ధి ఏదో బయటపెడుతున్నా డిప్పుడు సంజయ వాక్య వ్యపదేశంతో మొత్తం ప్రపంచానికే మహర్షి.

Page 535

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు