#


Index

మోక్ష సన్న్యాస యోగము

నంటాడు. దూరాన ఉండి ఎలా శ్రవణం చేశాడు. యుద్ధం జరిగిన 18 రోజులూ ఎప్పుడా యుద్ధ రంగంలో ఏమి జరిగిందో జరిగింది జరిగినట్టు చూచి అదంతా మరలా వచ్చి ధృతరాష్ట్రుడికి పూస గుచ్చినట్టు చెప్పేవాడు సంజయుడు. అలా చెప్పే శక్తి అతనికి కలిగే లాగా దూర దృష్టినీ జ్ఞాపకశక్తినీ ముందుగానే ప్రసాదించాడు వ్యాసభగవానుడు. అందుకే వ్యాస ప్రసాదా త్తని చెబుతున్నాడు.

రాజన్ సంస్మృత్య సంస్మృత్య - సంవాద మిమ ద్భుతం
కేశవార్జునయోః పుణ్యం హృష్యామిచ మహుర్ముహుః -76

తచ్చ సంస్మృత్య సంస్మృత్య - రూప మత్యద్భుతం హరేః
విస్మయోమే మహాన్ రాజన్ - హృష్యామి చ పునః పునః -77

  అంతేకాదు. ఆ కృష్ణార్జునుల సంవాద రూపమైన పరమాద్భుతమైన ఆ మహోపదేశమే ఇంకా నేను మరచిపోలేక పోతున్నాను. అది మనసులో చెరగకుండా నిలిచిపోయింది. మాటి మాటికీ గుర్తు వస్తూనే ఉన్నదది. అలావచ్చే కొద్దీ నా శరీర మెప్పటి కప్పుడు పులకిస్తూనే ఉంటుంది. అదంతా ఒక ఎత్తు. ఆయన బోధించిన అధ్యాత్మ విద్య అంతా ఒక ఎత్తయితే దానినంతటినీ నిదర్శనం చేసిచూపిన ఆయన విశ్వరూప ప్రదర్శనము తలుచుకొంటే ఎంత మహాద్భుతమో అది నా జీవితంలో ఎంత దివ్యానుభవమో అంతకన్నా చెప్పలేను. శరీరమే గాక నా మనస్సుకూడా

Page 534

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు