సరే. ఇక్కడికి శాస్త్రార్థ మనేది పరిసమాప్త మయింది. భగవద్గీత ఇక్కడికి ఆఖరు. శాస్త్ర మాఖరయినా భారత కథ ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. దానితో దీనికి సంబంధం కలుపుకొని చూడాలి మనమంటారు భగవత్పాదులు. ఏమిటది. సంజయ ధృతరాష్ట్ర సంవాదం. అందులో గదా వస్తుందీ కృష్ణార్జున సంవాదం. అంచేత అది కొంచెం చెప్పి ముగిస్తున్నాడీ గ్రంధం బాదరాయణ మహర్షి. శాస్త్రంగాక పోయినా శాస్త్రాని కనుబంధంగా చూడాలి మనమీ భాగాన్ని.
ఇత్యహం వాసుదేవస్య - పార్థస్యచ మహాత్మనః
సంవాద మిమ మశ్రేష - మద్భుతంరో మహర్షణమ్ - 74
వ్యాస ప్రసాదా చ్ఛృతవా నిమం గుహ్యతమం పరమ్
యోగం యోగేశ్వరా త్కృష్టా - త్సాక్షా త్కథయతః స్వయమ్-75
సంజయు డంటున్నాడు ధృతరాష్ట్రుడితో. మహారాజా వాసుదేవుడైన శ్రీకృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన ఈ సంవాదాన్ని నేను దూరం నుంచే శ్రవణం చేయగలిగాను. అది ఎంత అద్భుతమో ఏమో ఇప్పటికీ అది తలుచుకొంటే నా శరీరం గగురు పొడుస్తున్నది. మహానుభావుడు వ్యాసమహర్షి అనుగ్రహం వల్లనే ఇంత గొప్ప అధ్యాత్మ విద్యా రహస్యాన్ని నేను సాక్షాత్తూ యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ బోధిస్తుంటే ఆయన గారి ముఖతః దూరాన ఉన్నా శ్రవణం చేయగలిగా
Page 533