ఆత్మేదో అనాత్మేదో విభజించి చూస్తే అది వివేకం. అలా చూడకపోతే అవివేకం.
అనాత్మ కూడాఆత్మే గదా అని అడగవచ్చు నీవు. నిజమే ఆత్మంటే ఏమిటో తెలిసినవాడి కది. అప్పుడనాత్మ అనేది ఆత్మకు వేరుగా కనిపించదు. లేకుంటే అనాత్మ ప్రపంచం వాడి దృష్టి కాత్మకు వ్యతిరిక్తంగా ఒకటి వాస్తవంగా ఉన్నట్టు భ్రమ గొలుపుతుంటుంది. అంతా అస్తి భాతే గదా అని సామాన్యరూపంగా చూచే వాడి కాత్మ తప్ప అనాత్మ ఉండబోదు. ఇందులో సూక్ష్మమేమంటే వస్తుజ్ఞానం లేనంత వరకూ దాని ఆభాసే వస్తువయి కనిపిస్తుంది. అదేమో మరుగుపడి అసలే కనపడదు. కనపడక అది ఎక్కడో ఉందని భావిస్తుంటాడు. అంచేత ద్వైత దృష్టి వదలదు. అలాకాక అస్తిభాతి అని ఆత్మనే దర్శించాడను కోండి. అదే అనాత్మ కూడా కాబట్టి అస్తిభాతిగా ఆత్మే మిగిలిపోతుంది. అది అద్వైత దృష్టి ఇందులో వస్తు దృష్టి లేకపోవటం అజ్ఞానమైతే వస్తువును దర్శించటం వివేకం. దర్శిస్తే ఇక అనాత్మే లేకుండా పోతుంది కాబట్టి అద్వైతం.
అది గుర్తించావా లేదా అనే ఆచార్యుడుగా భగవానుడి తాపత్రయం. గుర్తించానని చెబుతాడా లేదా అని ఇప్పుడు ప్రశ్న.
నష్టోమోహః స్మృతి ర్లబ్ధా- త్పత్ప్రసాదాన్మయాచ్యుత
స్థితోస్మి గత సందేహః - కరిష్యే వచనం తవ -73
Page 530