#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఉత్తమ లోకాలకు వెళ్లిపోయి ఉత్తమ భోగా లనుభవిస్తూ కూచుంటారు. అదీ వీడికి కలిగే ఫలం.

కచ్చిదేత చ్ఛృతం పార్థ - త్వయై కాగ్రేణ చేతసా
కచ్చి దజ్ఞాన సమ్మోహః - ప్రణష్టస్తే ధనంజయ - 72

  పోతే ఇప్పుడింత దూరం తాను చేసిన ఉపదేశ మర్జునుడెంత గ్రహించాడో ఎంతవరకతని మనసుకు పట్టిందో అడిగి తెలుసుకోవా లనుకొన్నాడు భగవానుడు. ఒకవేళ అతడు చెప్పిన విషయం గ్రహించ లేదనుకోండి. మరొక మార్గంలోనైనా బోధ చేయవచ్చు. ఏదో ఒక విధంగా శిష్యుడికి బోధించి అతణ్ణి ఉద్ధరించటమే గురువనే వాడి కర్తవ్యం. ఇదే ఆచార్య ధర్మమని దాన్ని ప్రదర్శిస్తున్నదీ శ్లోకమంటారు భాష్యకారులు.

  కచ్చిదేతత్ శ్రుతం త్వయా ఏకాగ్రేణ చేతసా. ఏమర్జునా నీవు నా బోధ ఏకాగ్రమైన మనస్సుతో విన్నావు గదా. కచ్చి దజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే. దానివల్ల నీ అజ్ఞాన సమ్మోహం పూర్తిగా తొలగిపోయిందా. అజ్ఞాన సమ్మోహమేమిటి. రెండూ ఒకటే గదా. కాదు. సూక్ష్మమైన భేదముంది. అజ్ఞానం వల్ల సమ్మోహ మేర్పడుతుంది. అజ్ఞానమంటే ఆత్మ అనేదేమిటో దాన్ని సమగ్రంగా గ్రహించలేక పోవటం. దానివల్ల ఏమవుతుంది. సమ్మోహ మేర్పడుతుంది. సమ్మోహమంటే అవి విక్త భావః స్వాభావికః అని అర్థమట. ఏది ఏదయిందీ వివేచన చేయలేని దౌర్బల్యం.

Page 529

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు