#


Index

మోక్ష సన్న్యాస యోగము

శ్రద్ధా వా ననసూయశ్చ - శృణుయాదపి యో నరః
సోపి ముక్త శ్శుభాన్ లోకాన్ ప్రాప్నుయా త్పుణ్య కర్మణామ్-71

  గీతాశాస్త్రం ప్రవచనం చేసే అధ్యాపకుడికే ఫలం లభిస్తుందో చెప్పాడు. అది అధ్యయం చేసే పాఠకుడికేది లభిస్తుందో అదీ చెప్పాడు. పోతే ప్రస్తుతం వారిద్దరూ ఒకరి కొకరు బోధ చేస్తుంటే అది దగ్గరగా కూచొని తానూ శ్రవణం చేసేవాడెవడో అలాటి శ్రోతకు కలిగే ఫలితం చెబుతున్నాడు. వీడు కేవలం శ్లోకాలు శ్రవణం చేసినా సరే. శ్రద్ధావా నన సూయశ్చ. శ్రద్ధా సక్తులుండి అసూయాది దోషాలు లేని వాడైతే చాలు. అదే యోగ్యత. ఆ మీదట శబ్ద శ్రవణమే గాక అర్థం కూడా తెలుసుకొంటే మరీ మంచిదను కోండి. అలాకాక శ్రవణం మాత్రమే చేసినా ఫలితం లేకుండా పోదు. ఏమిటది. సోపి ముక్తః వాడూ ముక్తుడే. ముక్తుడేమిటి. ముక్తుడంటే పాపాన్ముక్తః పాప పంకం నుంచి బయటపడ్డ పుణ్యాత్ముడని అర్థం వ్రాశారు భాష్యకారులు. కేవలం శబ్ద శ్రవణమేగాని అర్ధ జ్ఞానం లేనివాడు వీడు. పరమార్ధ జ్ఞానమంత కన్నా లేదు. అలాంటప్పుడు ముక్తుడెలా కాగలడు. కనుకనే పాపాన్ముక్తః అని అర్థం చెప్పింది భగవత్పాదులు. పాపవిముక్తు డెప్పుడయ్యాడో ఇక వాడికి లభించే ఫలమేమిటి. శుభాన్ లోకాన్ ప్రాప్నుయా త్పుణ్య కర్మణామ్. పుణ్య కార్యాలు చేసేవారే లోకాలకు పోతారో అలాటి

Page 528

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు