పోతే ఇక సంప్రదాయ ప్రవర్తకుడైన ఆచార్యుడికి కలిగే ఫలమేదో వర్ణిస్తున్నాడు.
య ఇమం పరమం గుహ్యం మద్భక్తే ష్వభిధాస్యతి
భక్తిం మయి పరాంకృత్వా - మామే వైష్య త్యసం శయః - 68
య ఇమం పరమం గుహ్యం - ఎవడైతే ఈ పరమరహస్యమైన బ్రహ్మ విద్యను మద్భక్తేషు అభిధాస్యతి - నాభక్తులైన వారికి బోధ చేస్తాడో. ఎలా చేస్తాడని. భక్తింమయి పరాంకృత్వా. నామీద ఎనలేని భక్తి తాత్పర్యాలు అవలంబించి చేస్తాడో. ఇది నేను బోధిస్తున్నానంటే దీని ద్వారా పరమాత్మ సేవే చేయగలుగు తున్నానని భావిస్తాడో. అలాంటివాడు మామేవైష్యతి అసంశయః - దేహ పాతమైన తరువాత నా సాయుజ్యమే పొందుతాడు సందేహం లేదని హామీ ఇస్తున్నాడు భగవానుడు. భక్తి అని మరలా పరామర్శించటం Refer వల్ల చెప్పే అర్హత వినే అర్హత మరేదీ గాదు. భక్తి అనేది ఉంటే చాలు. అదే అన్నిటికీ జవాబు చెప్పగలదని అర్థమవుతున్న దంటారు భాష్యకారులు.
నచతస్మా న్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా - నచమే తస్మా - దన్యః ప్రియతరోభువి - 69
అసలీ బ్రహ్మవిద్యా సంప్రదాయం బాగా తాను గ్రహించి పదిమందికీ ప్రచారం చేసే మహానుభావు డున్నాడే నచ తస్మా న్మనుష్యేషు కశ్చిన్మే
Page 526