#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఉన్నా శుశ్రూష అనే గుణం లేకపోతే పనికిరాడు వాడు. అంతే కాదు. నచ మాం యో భ్యసూయతి అంటున్నాడు. ఇవి మూడూ అలా ఉంచి కనీసం నా మీద అసూయ లేకపోతే చాలు వాడు యోగ్యుడేనంటాడు. గుణేషు దోషారోపణ మసూయా అన్నారు. ఒక గుణముంటే దాన్ని దోషంగా చాటి చెప్పే భావ మసూయ Prejudice or Bias ఇది చాలా ప్రమాదకరం. అది ఉంటే అసలు బోధించనే రాదు. అసూయకా యా నృజవే శఠాయ - న మాదద్యాః అని విద్యావంతుడితో వాపోయిందట సరస్వతి.

  దీన్నిబట్టి చూస్తే ఏమర్థ మయింది మనకు. పరమాత్మ తత్త్వాన్ని బోధించే ఈ విద్యను శ్రవణం చేసే అర్హత తపోభక్తి శుశ్రూషా నసూయలనే నాలుగు లక్షణాలూ కలిసి ఉండటమే నని గ్రహించాలి మనం. అయితే మేధావినే తపస్వినేవా అని ఒక వికల్పం Option చెబుతున్నది శాస్త్రం. దాన్ని బట్టి శుశ్రూషా భక్తి ఈ రెండు గుణాలూ ఉన్న తపస్వికైనా మేధావంతుడికైనా చెప్పవచ్చు. మరి శుశ్రూషా భక్తి అనే గుణాలు లోపిస్తే మాత్రమెంత తపస్వి అయినా ఎంత మేధావి అయినా వాడికి చెప్పి ప్రయోజనం లేదు. అసూయ అనేది వదలనంత వరకూ ఎన్ని గొప్ప గుణాలున్నా వాడికి చెప్పి సుఖం లేదు. పోతే గురుశుశ్రూషా భక్తి అనే రెండు గుణాలున్నా చాలు. వాడు విద్యాస్వీకారాని కెంతైనా అర్హుడని శాస్త్ర సంప్రదాయాన్ని చక్కగా బయట పెడతారు భగవత్పాదులు.

Page 525

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు