చేయవలసిన సాధన ఏదో బోధిస్తుంది. పోతే ఉత్తరార్థం దానివల్ల కలిగే సిద్ధిని వర్ణిస్తుంది. కర్మయోగి జ్ఞానయోగి గా మారాలంటే ఏమిచేయాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మాలన్నీ నిర్మొహమాటంగా వదిలి వేయాలి. ధర్మమంటే అధర్మమే గాదు. ధర్మమని కూడా అర్థం చెప్పారు భాష్యకారులు. అంటే సర్వమని ఉంది కాబట్టి ధర్మ మధర్మమనే తేడా చూడకుండా కర్మలన్నీ పరిత్యజించాలని ఆయన తాత్పర్యం. త్యజ ధర్మమ ధర్మంచ అని మహాభారత వచన మాయన ఉదాహరిస్తారు కూడా.
అంతవరకే గాదు. ఆ మాటకు వస్తే ఆత్మ మీద అజ్ఞానవశాత్తూ
మనమారోపించిన నామరూప క్రియలే ధర్మాలు All Attributes imposed
on the universal self. పదార్థ ధర్మమంటే ఏమిటి. దాని గుణమని
అర్థం. Properties. ఏమిటిక్కడ గుణాలు. జీవుడొక గుణం - జగతొక
గుణం. ఆఖరుకు ఈశ్వరుడూ ఒక గుణమే. అది గాక దానికి సంబంధించిన
వన్నీ దాని గుణాలే. జీవజగదీశ్వరులు తత్త్వం కాదు. తత్త్వాని కారోపించిన
గుణాలు. గుణా లాభాస. ఆత్మతత్త్వమే జీవజగదీశ్వర రూపంగా
భాసిస్తున్నది. కనుక మనమిప్పుడు శుద్ధమైన ఆత్మ తత్త్వాన్నే అనుభవానికి
తెచ్చుకోవాలంటే ఈగుణాల నన్నింటినీ అందులో ప్రవిలాపనం
అదే నని చేసుకోవాలి. అదే పరిత్యాగమంటే. దానికివి అన్యం కావు
అద్వితీయంగా దాన్ని పట్టుకోవాలని భావం.
Page 520