#


Index

మోక్ష సన్న్యాస యోగము

  కర్మయోగాన్ని గూర్చి చెప్పవలసిన దంతా చెప్పి దాని వల్ల సాధకుడందు కోవలసిన జ్ఞాన యోగమనే రెండవ భూమికను వర్ణిస్తున్నాడు పరమాత్మ. దీనితో సమాప్తమిక గీతోపదేశం. కనుకనే దీనికి చరమ శ్లోకమని పేరు వచ్చింది. చరమమైనా ఇదే. పరమమైనా ఇదే. ఇది ద్వైతులకూ ముఖ్యమే. అద్వైతులకూ ముఖ్యమైనదే. అయితే ద్వైతులు దీన్ని వారి దృష్టికి తగినట్టు జీవేశ్వర భేద బుద్ధి వదలకుండా వ్యాఖ్యానిస్తారు. అద్వైతులు ఇరువురికీ తేడా చూడకుండా అనన్య దృష్టితో వ్యాఖ్యానిస్తారు. ద్వైత దృష్టితో అర్థం చెప్పవచ్చు. తప్పులేదు. కాని అది ఇంతకుముందు చెప్పిన కర్మయోగం క్రిందికే వస్తుంది. అంతకు మించి అదనంగా ఏదీ చెప్పినట్టు గాదు. కర్మయోగమయి గదా మనమిప్పుడు జ్ఞానయోగ విషయం భగవానుడేమి సెలవిస్తాడా అని ఎదురు చూస్తున్నాము. అలాంటప్పుడిది కూడా అదేనని భ్యంగ్యం తరంగా వర్ణిస్తే ప్రయోజన మేముంది. మన్మనా భవ మద్భక్తః అంటే ఎంతో మామేకం శరణం వ్రజ అన్నా అంతే. మామే వైష్యసి అంటే ఎంతో మోక్షయిష్యామి అంటే అంతేనని చెప్పిందే మరో భాషలో చెప్పినట్టవుతుంది.

  అంచేత అద్వైత పరంగా వ్యాఖ్యానించి నప్పుడే ఈ శ్లోకం పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అది మన స్వానుభవానికి వస్తుంది. అది ఎలాగోచూద్దాము. ఇందులో పూర్వార్ధం కర్మయోగి

Page 519

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు