#


Index

మోక్ష సన్న్యాస యోగము

పొందుతావంటాడు ఏమిటర్ధం. కర్మ జ్ఞానంగా మారుతుందని. జ్ఞానమే భగవత్స్వరూపం. కనుక కర్మలాగా అది వ్యభిచారి గాదు. కూటస్థం. ఎప్పటికీ నిలిచేది. అదే సత్యం. ప్రతి జానే అంటున్నాడు మరలా. సత్యభావన సత్యాన్నే చేరుస్తుందనటంలో సందేహం లేదు. నీవు నాకు ప్రేమపాత్రుడవు కాబట్టి ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను నమ్మమంటున్నాడు పరమాత్మ. అంచేత కర్మయోగమే మొదట మనం చేయవలసిన గొప్ప సాధన.

  ఇప్పుడు చెప్పుకొన్న శ్లోకం లాంటిదే ఇంతకు ముందు కూడా ఒకటి వచ్చింది. చూచారో లేదో. అది నవమాధ్యాయం చివరలో వచ్చింది. రాజవిద్యా రాజగుహ్య యోగమది. అక్కడ సర్వత్రా సమంగా వ్యాపించి నేను ఉన్నానని చెప్పి అలాటి సర్వవ్యాపకమైన తత్త్వాన్నే నీవు పట్టుకోగలవని ఇలాగే హామీ ఇస్తాడు. అది సాధకుడి ఆత్మ స్వరూపమే అంతకన్నా అన్యం కాదనే అద్వైత భావమే చెప్పాడక్కడ. అదే సత్యమని ఇక్కడ మరలా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడు మనకు. ద్విర్బద్ధం సుబద్ధం భవతి అని ఒక న్యాయమున్నది. రెండు మార్లు ఒకే మాట అన్నాడంటే అది సత్యమని వేరే చెప్పనక్కర లేదు.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వపాపే భ్యో - మోక్షయిష్యామి మాశుచః - 66

Page 518

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు