#


Index

మోక్ష సన్న్యాస యోగము

అంటే దాన్నే అంట పట్టుకోవాలని అర్థం. మొదట మనసు దానిమీదికి మళ్లించటం. తరువాత దానినే గట్టిగా పట్టుకొని కూచోటం. మద్యాజీమాం నమస్కురు. యాజీ అంటే యజ్ఞం చేయటం. యజ్ఞమిక్కడ మానవుడి ప్రవర్తనే. ఇంద్రియ వ్యాపారాలే. వాడి జీవితమంతా ఆ సమష్టి రూపమైన ఈశ్వర భావంతోనే నిండిపోవాలి. ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా ఏ పని చేసినా అదంతా ఈశ్వర భావనా రూపమైన ఒక మహాయజ్ఞమే. సాధకుడి జీవితమే యజ్ఞం. పోతే మాం నమస్కురు. నమస్కారమంటే తలవంచి దాసోహ మనటం. తన యావత్తూ దానికే సమర్పించటం ఏమిటది. ఒకటి కావాలనే సంకల్పం. ఒక క్రియ. దానివల్ల కలిగే ఫలం అంతా భగవదర్పణమని భావించటమే నమస్కారమనే మాటకర్థం.

  ఈ విధంగా మానసిక వాచిక కాయిక వ్యాపారాలన్నీ భగవదంకితం చేయగలిగితే అప్పుడు త్రికరణాలతో ఏ పని చేసినా అది సాధకుడు తన వ్యష్టి భావనతో చేయటం కాదు. సమష్టి భావనతోనే నిండిపోతుందతని సమస్తమూ. వ్యష్టి మీద సమష్టి అనే రంగు పులిమి వ్యష్టి నిక ఏమాత్రమూ కనపడకుండా పరిచ్ఛిన్నమైన జీవితానికి స్వస్తి చెప్పి పరిపూర్ణమైన దివ్య జీవనం సాగిస్తుంటాడు. అలాటి కర్మ యోగి ప్రతి కదలికా ఇక కర్మ కాదు. కారణం. జ్ఞాన స్వరూపమైన సమష్టిని పట్టుకొన్నది కాబట్టి జ్ఞానంగా మారిపోగలదు. అదే హామీ ఇస్తున్నాడు. మామే వైష్యసి అని నన్నే

Page 517

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు