#


Index

మోక్ష సన్న్యాస యోగము

జ్ఞానం కర్మ అనే భావాలు రెండే రకరకాల వేషాలలో మనకు దర్శన మిస్తుంటాయి. రెండింటిలో ఏది కావాలి నీకని నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అవివేకం కొద్దీ నీవొక దానినుంచి ఒకటి వేరు చేసి కర్మ కావాలనుకొన్నా అది నిష్కామంగా నిరహంకారంగా చేయి - జ్ఞానానికే దారితీసి అందులోనే సమాప్త మవుతుందని బోధిస్తుంది. లేదు జ్ఞానమే కావాలి నాకదే చాలునన్నావా - అది పరిపూర్ణమయ్యే సరికీ కర్మ జగత్తంతా దాని విభూతే దాని విలాసమే అంతకన్నా వేరుగాదని మరలా నీకు చాటి చెబుతుంది. ఇలాటి సమన్వయం నీకు గుర్తు చేయటానికే అక్కడక్కడా కొన్ని మైలురాళ్లు పాతి చూపుతుంది నీ ప్రయాణ మార్గంలో. కర్మణ్య కర్మ. సర్వభూతస్థం. యదాభూత పృథగ్భావ మిలాంటి శ్లోకాలన్నీ ఆ పాతిన మైలురాళ్లే. మరేవో గావు. జ్ఞానకర్మ సమన్వయ మంటే ఏమనుకొంటున్నారు. మానవ జీవిత సమన్వయమే అది. జ్ఞాన శక్తే క్రియా శక్తే మనమైనా ఈ ప్రపంచమైనా. ఆఖరుకు పరమాత్మ అయినా. ఇంత గొప్ప అద్వైత భావమిది. ఇది అనుభవానికి వస్తే అంతా వచ్చినట్టే. గీతోపదేశ సర్వస్వమిది. ఇది 17, 18 అధ్యాయాల్లో శాఖోపశాఖాత్మకంగా విస్తరించి చెప్పి ఆ విస్తారంలో దీనినెక్కడ విస్మరిస్తారో ఈ పాఠకులు విస్మరిస్తే సాధన చేసి తరించలేరే ఈ మానవులని మనమీద ఎంతో సానుభూతి వహించి ఆ రెండింటి మీదనే మనం దృష్టి కేంద్రీకరించాలని

Page 515

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు