ప్రసరణ. జీవజగదీశ్వర రూపంగా అఖండమైన జ్ఞానమే ప్రసరించి ఇలా
కనిపిస్తున్నది. దీనితో ఆత్మానాత్మలకూ లేదా జ్ఞాన జ్ఞేయాలకూ రెండింటికీ
బ్రహ్మాండమైన సమన్వయం చేశారు అద్వైత దార్శనికులు. పోతే ఈ
జ్ఞాన జ్ఞేయాలకే జ్ఞానమనీ కర్మ అనీ వ్యాసభగవానుడు చేసిన నామకరణం.
జ్ఞానమనేది మన స్వరూపమైతే కర్మ అనేది దాని ప్రసరణ. అదే విభూతి.
మొదటిది సూర్యమండలమను కొంటే రెండవది సర్వతోముఖంగా వ్యాపించే
దాని ప్రకాశ మనుకోవచ్చు. ఇందులో జ్ఞానమే నేరుగా పట్టుకోగలిగితే
చాలు. దాని ప్రసారమే దాని ప్రకాశమే గదా ఈ జీవ జగదీశ్వర భేద
ప్రపంచ మంతానని అర్థం చేసుకోగలడు మానవుడు. వాడు జ్ఞాని. పోతే
నేరుగా అందుకోలేక దాని విభూతి ద్వారా కొంత కాలానికి స్వరూపాన్ని
పట్టుకోగలిగితే అదీ మంచిదే. వాడు యోగి. ఇంకా స్పష్టంగా చెబితే మొదటి
వాడు జ్ఞానయోగి. వాడిది జ్ఞానయోగం. రెండవ వాడు కర్మ యోగి. వీడిది
కర్మయోగం. మొత్తం మీద వాడు సూటిగా అందుకొన్నా అది జ్ఞానమే.
వీడు చాటుగా అందుకొన్నా అదీ జ్ఞానమే. అప్పుడంత వరకూ వీణ్ణి
నడుపుతూ వచ్చిన కర్మ ఆ జ్ఞానంలో సమసిపోతుంది. చివరకు వీడికీ
వాడికీ దక్కేది అఖండాత్మ జ్ఞానమే. అదే బ్రహ్మం. అదే మోక్షం జీవితానికి.
ఇప్పుడు భగవద్గీత శాస్త్రీయమైన పంధాలో ఆది నుంచీ సాగిస్తూ వచ్చిన బోధ ఇదే. కనుకనే ఏ అధ్యాయంలో నీవు తొంగి చూచినా
Page 514