#


Index

మోక్ష సన్న్యాస యోగము

క్రొత్తగా బయట పెడుతున్నాడంటే ఇంతవరకూ పెట్టలేదనేగా అర్థం. అలాగైతే గీతలో మిగతా అధ్యాయాలూ నిరర్థకమే. ఈ అధ్యాయంలో కూడా ఇప్పుడు చెప్పబోయే రెండూ తప్ప మిగతా శ్లోకాలూ నిష్ప్రయోజనమే కావలసి వస్తుంది. మరి అలాంటప్పు డెందుకన్నట్టీ మాట సర్వగుహ్యతమ మని.

  ఇందులో ఒక గొప్ప సూక్ష్మమున్నది. అదేమంటే అసలీ భగవద్గీతా శాస్త్రమెందుకు వచ్చింది. సమస్యను పరిష్కరించటానికి. ఏమిటా సమస్య. ఒక్కటే. మరణ సమస్య. దానివల్లనే మానవుడికి విషాదం. అది ఎలా తొలగిపోతుంది. ఆత్మానాత్మలు రెండూ వేరనే ద్వైత దృష్టి ఉన్నంత వరకూ పోదు. అనాత్మ అనేది లేదు. ఉన్నదంతా ఒకే ఒక ఆత్మ స్వరూపం. ఈ అనాత్మ అని చూస్తున్నది కూడా ఆత్మ తాలూకు ఆ భాషే. అది నీవు జీవుడను జగత్తను. ఈశ్వరుడను. ఆత్మను పూర్తిగా అర్థం చేసుకోక పోవటం వల్లనే అదే ఈ మూడు రూపాల్లో మనకు దర్శన మిస్తున్నది. కనుక ఇదేదో గాదు. అర్థం చేసుకొంటే దాని విభూతే దాని విస్తారమేనని అద్వైత దృష్టితో ఆకళించుకొంటే చాలు. అప్పుడిక ఏ సమస్యా లేదు మనకు. ఆత్మ స్వరూపంగా ఎప్పుడూ నిలిచి ఉంటాము. కాబట్టి జనన మరణలూ లేవు. తన్మూలమైన విషాదమూ లేదు. ఇదీ విషయం.

  ఇందులో ఆత్మ అదేది వస్తువైతే అనాత్మ అనేదంతా దాని విభూతి. మరొక విధంగా చెబితే అది జ్ఞానమైతే ఇదంతా ఆ జ్ఞానం తాలూకు

Page 513

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు