#


Index

మోక్ష సన్న్యాస యోగము

  రోగి అనిపించుకోటం నీకిష్టం లేకపోతే - రోగానికి తగిన చికిత్స చేయించుకొని ఈ భవ రోగం నుంచి బయటపడాలనే దృఢమైన దీక్ష నీకుంటే - అన్నిటి కన్నా గుహ్యతమమైన విషయమొకటి చెబుతున్నానిప్పుడు వినమంటున్నాడు భగవానుడు. ఇంతకు ముందే గదా చెప్పాడు గుహ్యాద్గుహ్యతరమని అలాంటప్పుడిక క్రొత్తగా చెప్పవలసిన రహస్యమే ముంటుందని. అది గుహ్యమే గుహ్యతరమే. కాని గుహ్యతమం కాదు. ఇప్పుడు చెప్పేది సర్వగుహ్యతమం. అన్ని రహస్యాల లోకీ ఆఖరుసారిగా చెప్పబోయే రహస్యం. అందుకే భూయః శృణు. మళ్లీ చెబుతున్నాను వినమంటాడు. ఏమిటంత గొప్పదా అది. పరమం వచః -ఇది చెబితే ఇక నేను నీకు చెప్పవలసిందీ లేదు. నీవు నావల్ల వినవలసిందీ లేదని చాటుతున్నాడు. అదైనా ఎందుకంత విలువైన భావం బయట పెడుతున్నా నంటే నీవు నాకేదో ఒరగ బెడతావని కాదు. ఇప్టోసి మే దృఢమితి వక్ష్యామి తేహితం. నీవు నాకు చాలా కావలసిన వాడవు కాబట్టి నీకు మేలు చేసేదేదో అది బయటపెట్టటం నా ధర్మమని చేస్తున్నానీ బోధ అంటాడు.

  అయితే ఒక చిన్న ఆశంక. ఇంతవరకూ భగవానుడు మనకు బోధించని దంటూ ఏముందని ఇప్పుడు క్రొత్తగా ఒక రహస్యం చెప్పటానికి. రాజ విద్యా రాజగుహ్యం కంటే రహస్యమా ఇది. ఇప్పుడే

Page 512

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు