#


Index

మోక్ష సన్న్యాస యోగము

ప్రత్యభి జ్ఞే ఏకైక సాధనమని ఘోషించటం. కర్మోపాసనాదు లేవీ కావు. అవి చిత్తశుద్ధికే గాని మోక్షసిద్ధికి సాధనాలు కావు.

ఇతి తే జ్ఞాన మాఖ్యాతం - గుహ్యాద్గుహ్యతరం మయా
విమృశ్యైత దశేషేణ - యధేచ్ఛసి తథా కురు - 63

  ఇక్కడికి మనకుపదేశించ వలసినదంతా చాలా వరకుప దేశించి నట్టే పరమాత్మ. పరమాత్మ వ్యపదేశంతో వ్యాసమహర్షి. పోతే ఆయన బాధ్యత ఇక ఏమీ లేదు. ఉన్న బాధ్యత అంతా ఇప్పుడు మనబోటి జీవులదే. ఇందులో ఆయన తన బాధ్యత ఎలా నెరవేర్చాడో చెబుతున్నాడు మొదట. ఇతి తే జ్ఞాన మాఖ్యాతం. ఇప్పటికి 18 అధ్యాయాల వరకూ నేను నీకు బోధించవలసిన జ్ఞాన మంతా బోధిస్తూ వచ్చాను. అది కూడా మామూలు లోక జ్ఞానం గాదు. శాస్త్రజ్ఞానం కాదు. తుదకు ధర్మ జ్ఞానం కూడా లేదు. గుహ్యా ద్గుహ్యతరం. అవన్నీ గుహ్యమైతే కావచ్చు. అంటే ఏవో జీవిత రహస్యాలు కొన్ని నీకు విప్పి చెబితే చెప్పవచ్చు. కాని ఇది అలాంటిది గాదు. గుహ్యాద్గుహ్యతరం. రహస్యాలన్నిటికీ కట్ట కడపటి జీవిత రహస్యం. ఏమిటది మోక్షం. బ్రహ్మ భావం. సర్వాత్మ భావం. ఆత్మానాత్మలనే తేడా లేక అంతా ఏకైకమైన ఆత్మ స్వరూపంగా దర్శించే జ్ఞానం. ఇది మరి ఏ శాస్త్రంలో విద్యలో కళలో కనపడే విషయం కాదు. అవన్నీ సాపేక్షమైతే

Page 510

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు