చాటుతున్నదింకొక ఉపనిషత్తు. మహా అయితే అనాత్మ పదార్ధాన్ని విషయంగా పట్టుకోమని ఆత్మతత్త్వాన్ని అలా కాక మన స్వరూపమే కాబట్టి విషయిగా Subjective పట్టుకోవాలని శాస్త్రం చెప్పే మాట. అంచేత జ్ఞేయమని భగవద్గీత ఆత్మను పేర్కొన్నదనగానే మనములిక్కి పడరాదు. క్షేత్రమెలా తెలుసుకొన్నామో క్షేత్రజ్ఞుడైన ఆత్మ కూడా ఏమిటో ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలని గీత మనకిస్తున్న సలహా ఇది. అలా కాకుంటే అది చెప్పేది లేదు. మనం వినేది లేదు. అది చెప్పక మనం వినకపోతే ఆత్మ అంటే ఏమిటో అది ఎలా గ్రహించాలో మనకంతు పట్టదు. పట్టకపోతే మనకిప్పుడున్న నకిలీ ఆత్మనే అసలైన ఆత్మ అని అపోహ పడుతూ దీనితోనే కన్నుమూసే ప్రమాదముంది. కాబట్టి ఆభాస రూపమైన ఆత్మను వదిలేసి వాస్తవమైన మన ఆత్మ స్వరూపాన్ని గుర్తించి మనమీ సంసార బంధంలో నుంచి బయటపడాలంటే దాని జ్ఞానం మనకు శాస్త్ర మందివ్వాలి. అందిస్తే దాని నందుకొని మనం తరించగలం. ఇదీ విషయం.
మంచిదే. కాని ఇప్పుడా జ్ఞేయమైన పరమాత్మ తత్త్వాన్ని కష్టపడి మన మందుకొన్నామే అనుకోండి. దానివల్ల మనకు కలిగే మహా ప్రయోజన మేమిటంటారు. చెప్పాము గదా సంసార బంధంలో నుంచి బయటపడి తరిస్తామని. అంతకన్నా మానవుడు కోరదగిన పురుషార్ధమే మున్నది జీవితానికి. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. యద్ జ్ఞాత్వ మృతమశ్నుతే అని. అసలైన ఆత్మ స్వరూపమే నీవు గుర్తించ గలిగావంటే అంతకన్నా కావలసిన దేముంది బాబూ. నీవమృతాన్నే చవి చూస్తావు. మృతం కాని దేదో అది