#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా ఽ మృతమశ్నుతే
అనాది మత్సరం బ్రహ్మ నస త్త న్నాస దుచ్యతే - 12

  ఇప్పుడింత వరకూ ఏకరువు పెడుతూ వచ్చిన జ్ఞానమనే సాధన బలంతో మానవు డర్ధం చేసుకోవలసిన పదార్థ మేమిటని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నాడు గీతాచార్యుడు. జ్ఞేయం యత్త త్ప్రవక్ష్యామి. మీరు జ్ఞానంతో గ్రహించవలసిన ఆ జ్ఞేయమేమిటో అది చెప్పబోతున్నాను. వినమంటున్నాడు మహర్షి జ్ఞేయమంటే మానవుడు తెలుసుకోవలసిన ఆత్మ తత్త్వమని అర్థం. ఆత్మ జ్ఞేయం కాదు గదా జ్ఞానానికేదైనా గోచరిస్తే గదా అది జ్ఞేయ మవుతుంది. ఆత్మ జ్ఞానస్వరూపమని గదా వర్ణించారింత వరకూ. అలాంటప్పుడది జ్ఞేయమెలా కాగలదు. నిజమే. జ్ఞానానికి గోచరించేది గాదాత్మ. గోచరిస్తుందని చెప్పటం లేదు మేము. ఇక్కడ జ్ఞేయమంటే ఆత్మ అంటే ఏమిటో దాని స్వరూపం ఫలానా అని చెప్పబోతున్నాము గనుక జ్ఞేయమని వ్యవహరిస్తున్నాము. అంతేగాని జ్ఞానానికి విషయంగా పట్టుకోమని గాదు మహర్షి వివక్షితం.

  జ్ఞానస్వరూపమే అయినా అది ఇప్పుడు మన మనస్సుకు స్ఫురించటం లేదు గనుక స్ఫురించాలంటే తదాకార వృత్తి ఏర్పాడాలి మనస్సుకు. ఆత్మైనా అనాత్మైనా ఏదైనా అనుభవానికి రావాలంటే తదాకారమైన వృత్తితోనే దర్శించాలి దాన్ని. అందుకే ఆత్మావా అరే ద్రష్టవ్యః ఆత్మను చూడాలంటున్న దుపనిషత్తు. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా. అతి సూక్ష్మమైన బుద్ధి వృత్తితోనే దాన్ని దర్శించవలసి ఉంటుందని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు