ఈశ్వరుడెక్కడో గాదు. మన హృదయంలోనే నిత్యమూ సన్నిహితుడయి ఉన్నాడు. ఆయన శక్తితోనే మన మనోవాక్కాయేంద్రియా లన్నీ నిత్యమూ ఆయా కార్యాలు సాగిస్తూ పోతున్నాయని చెప్పాము కాబట్టి మానవుడు చేయవలసిన పనేమిటిప్పుడు. ఆశ్వరుడి స్మృతి పెట్టుకొని ఏమరకుండా బ్రతుకు సాగించమని గదా. అదే బోధిస్తున్నాడు మన కందరికీ మహర్షి తమేవ శరణం గచ్ఛ. ఆ ఈశ్వర భావన పెట్టుకొని దానికే అంకిత మయి పొండి. అది కూడా సర్వభావేన. మనసా వచసా కర్మణా. త్రికరణ శుద్ధిగా పాటించండి. అలా ఈశ్వర భావనతో మీరు నిండిపోతే తద్భావ భావితః అన్నట్టు తత్ప్రసాదాత్. ఆయన అనుగ్రహానికి పాత్రు లవుతారు మీరు. అంటే మీలో గుప్తంగా ఉన్న ఆ ఈశ్వర శక్తే ప్రకటమై పైకి వచ్చి మీకు కావలసిన ఫలితమిస్తుంది. ఏమిటా ఫలితం. శాంతిం స్థానం ప్రాప్స్య సి శాశ్వతం. శాంతీ స్థానమూ నట. శాంతి అంటే సంసార తాప శాంతి. సుఖదుఃఖాది ద్వంద్వానుభవ మక్కడి కంతమయి పోతుంది. దానితో సంసార బంధమనే దుండదిక. తొలగిపోతుంది. ఇది ప్రతిలోమమైతే అనులోమంగా కలిగే ఫలం స్థానం శాశ్వతం. అంటే ఎప్పటికీ అనుభవానికి వచ్చే స్థానం. అపవర్గం. లేదా మోక్షం.
ఇంతకన్నా కావలసిందేమిటి జీవితానికి. సమస్య తొలగిపోవటం. తజ్జన్యమైన శాశ్వత సుఖాన్ని చవిచూడటం. విషాదం సమస్య అయితే మోక్షమే దానికి పరిష్కారమని గదా చెబుతూ వచ్చాము. అన్ని విషాదాలకూ
Page 508