#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఉంది. మీరు చెబుతున్న ఈ ప్రకృతే అది. ఎటు వచ్చీ సాంఖ్యులు దాన్ని స్వతంత్రమంటే మేమది ఈశ్వర చైతన్యాన్ని ఆశ్రయించి దాని కధీనమయి ఉంటుందని చెబుతాము. జ్ఞానశక్తి ఈశ్వరుడైతే ఇది ఆయన క్రియాశక్తి. ఆయన తానుగా చేయకపోయినా ఆయన సంకల్ప బలంతో ఇది ఆయా సృష్టి లయాది వ్యాపారాలు సాగిస్తూ ఉంటుంది. మానవుడి వాసనలూ వాడి పనులూ అన్నీ ఆ ఈశ్వర సాన్నిధ్య బలంతోనే చేస్తుంటుందని అన్నీ చక్కగా సమన్వయించారు.

  అదే వర్ణిస్తున్నా డిప్పుడు వ్యాస భగవానుడు. ఈశ్వరః అని ఈశ్వరుడే సమస్తభూతాల హృదయాలలో ప్రవేశించి కూచొని ఉన్నాడు. ఆయన కూచున్నాడంటే ఆయన మాయాశక్తి కూడా ఆయనతో పాటు అక్కడే ఉన్నదని అర్థం. శక్తి శక్తి మతోరభేదః అన్నారు. ఈశ్వరుడికీ ఆయన ప్రకృతికీ తేడా లేదు. దానినెప్పుడూ తాన వశంలో ఉంచుకొనే ఉంటాడాయన. అలా స్వాధీనం చేసుకొని ఉండటం వల్లనే ఆయన ఈశ్వరు డయ్యా డసలు Commander మత్తః పరతరం నాన్యత్తని ఇంతకు ముందే బయటపెట్టాడీ విషయం. కాబట్టి మనందరి హృదయాల్లో ఈశ్వరు డున్నాడంటే జ్ఞాన స్వరూపంగా వ్యాపించి ఉన్నాడని అర్థం. పోతే ఆయాన శక్తి క్రియారూపంగా మనలో పనిచేస్తూ ఉంది. ఏమిటది. ఎలా అని అడుగుతావేమో.

Page 506

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు