#


Index

మోక్ష సన్న్యాస యోగము

సంకల్పమెలా ఉంటుంది దానికి. సంకల్పమనేది చేతనానికే గాని అచేతనాని కేర్పడదు. అలాంటప్పుడది మనలో చేరటమేమిటి. మనల నది చేయి ఇది చేయమని పురమాయించట మేమిటి. దానికి బానిసలయి పోయి ఈ చేతనులైన మానవులీ కర్మలన్నీ చేయలేక చావటమేమిటని సందేహం రావటం సబబే.

  దానికి సమాధానమే ఇప్పుడీ శ్లోకం. ప్రకృతి అనేదేమను కొంటున్నారు మీరు. సాంఖ్యులు చెప్పే ప్రకృతి గాదిది. సాంఖ్యుల కీశ్వరుడు లేడు. ఉన్నదంతా జడమైన ప్రకృతే. దానికే ప్రధానమని పేరు పెడతారు. ఈశ్వరుడనే చేతనుడి ఆశ్రయం లేదు గనుక అది కేవల మచేతనం కాక తప్పదు. అయినా అదే సమస్త సృష్టి చేస్తున్నదంటారు వారు. కష్టసుఖాలు కూడా అదే తెచ్చి ఈ అల్ప చేతనుడైన మానవుడి మీద పడేస్తున్నదని కూడా వాదిస్తారు. అచేతనం గదా అది దానికి సృష్టించాలనే సంకల్పమెలా కలుగుతుంది. చేతనుడైన పురుషుణ్ణి అది బాధించటమెలా సంభవమని ఆలోచించరు.

  పోతే వేదాంతులది యుక్తి యుక్తం కాదని త్రోసిపుచ్చి సృష్టి స్థితి లయాలకు మూలకారణం జడమైన ప్రకృతి కాదు. చేతనుడైన ఈశ్వరుడే కారణమని నిర్ణయించారు. మరి చైతన్యం నిరాకారం నిశ్చలం గదా అది ఎలా చేయ గలుగుతుందని అడిగితే అది నిశ్చలమైనా దానికొక శక్తి

Page 505

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు