#


Index

మోక్ష సన్న్యాస యోగము

మిగతా అందరూ అజ్ఞానులే. అజ్ఞాని అయి వాడు జ్ఞాని కర్మ వదిలేశాడు గదా నేను మాత్రమెందుకు వదిలేయ రాదని భావించరాదు. వాడు జ్ఞాని అయి వదిలేశాడు. ప్రారబ్ధ కర్మ ఉన్నా జ్ఞాన దృష్టితో దాన్ని అకర్మగా భావించగలడు. వీడికా నేర్పు లేదు గదా. అలా చూడలేడు గదా. వీడికి కర్మ కర్మే. జ్ఞాన మసలు లేదు. ఎలా వదిలేయ గలడు. చచ్చినట్టు శాస్త్రోక్త కర్మలన్నీ చేయవలసిందే.

  కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ - ఒకవేళ కాదని చేయకుండా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ భీష్మించుకొన్నా అది వట్టి భ్రమ నీకు. కరిష్య స్యవశోపి తత్ - నీ విష్ణ పడకపోయినా ఇష్టానిష్టాలు నీవశంలో లేవు. ప్రకృతి వశంలో ఉంటాయని చెప్పాను గదా. ఒక్కొక్కడి కొక్కొక్క ప్రకృతి వాసనారూపంగా పనిచేస్తుందని. అది నీ చేత బలవంతంగా చేయిస్తుందా పని. కాబట్టి కర్మ చేయకుండా తప్పించుకోలేవు. ఇది అప్పు డర్జునుడికి చేసిన బోధేనని అనుకోనక్కర లేదు మనమిప్పుడు. మనకూ చేస్తున్న బోధే ఇది.

ఈశ్వర స్సర్వ భూతానాం - హృద్దేశే ఽ ర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా - 61

  అసలీ ప్రకృతి అనేదాని కంత పవరెక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యం మనకు. కారణమేమంటే ప్రకృతి అనండి. దాని వల్ల ఏర్పడిన సంస్కారా లనండి. అదంతా అచేతనం. దానికి చైతన్యమనేది అణుమాత్రం లేదు. ఫలానా వాడిలో చేరి వాణ్ణి నిత్యమూ కష్ట సుఖాల పాలుచేద్దామనే

Page 504

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు