#


Index

మోక్ష సన్న్యాస యోగము

అలాంటప్పుడీ ఆదేశాన్ని మనమెలా అర్థం చేసుకోవాలని ప్రశ్న. దీనికి సమాధానమేమంటే . క్షత్రియుడంటే మనలో ఉన్న ప్రాణశక్తి. చేసే యుద్ధం నిరంతరమూ లోపలా వెలపలా సాగించే లోక వ్యవహారం. అది మానేసి కేవలం కళ్లు మూసుకొని ధ్యానం చేస్తూ కూచోటమే అర్జునుడు రణరంగం నుంచి పలాయనమయి పోవటమనే మాట కంత రార్థం. ఇలా చెప్పుకొంటే జనసామాన్యాని కంతా వర్తించే ఉపదేశమిది.

స్వభావ జేన కౌంతేయ- నిబద్ధః స్వేన కర్మణా
కర్తుం నేచ్ఛసియ న్మోహా- త్కరిష్యస్యవశోపి తత్ - 60

  ఒక్కొక్క మానవుడి కొక్కొక్క స్వభావముంటుంది. స్వభావమంటే వాడి ప్రకృతి. అది జన్మ జన్మల నుంచీ పోగైన సంస్కారం వాడికి. లోపల జేరి అది పురుగై తొలుస్తుంది. ఆ పనీ ఈ పనీ చేయమని పురమాయి స్తుంటుంది వాణ్ణి. కార్యతే హ్యవశః కర్మ. చేయక తప్పదెవడూ. ఆఖరుకు జీవన్ముక్తుడైనా సరే తప్పించుకోలేడు.

  అయితే మరి మామూలు వాడూ జీవన్ముక్తుడైన జ్ఞానీ ఇద్దరికీ తేడా ఏముంది. ఇద్దరికీ కర్మ బంధం తప్పదు గదా అని సందేహం. ఇక్కడే ఉంది రహస్యం. జ్ఞానికి ప్రపంచ వ్యవహారం లేదని గాదు. సామాన్యుడి కున్నట్టే వాడికీ ఉంటుంది. కనపడుతుంటుందీ ప్రపంచం. కాని ఇద్దరి దృష్టిలో ఉంటుంది తేడా. సృష్టి ఒకటే అయినా దృష్టి వేరు. సామాన్యుడీ

Page 502

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు