జ్ఞానోదయమై పరమపదమైన మోక్ష సుఖాన్నే పడయగలవు. అని అభయమిస్తాడు.
చేత సా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
బుద్ధి యోగ ము పాశ్రిత్య - మచ్చిత్త స్సతతం భవ -57
భక్తి యోగాని కంత ప్రభావముంది గనుకనే చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య. నీవొక పనిచేయి. దృష్టా దృష్టమైన సకలకర్మలూ వివేక బుద్ధితో నాకే సమర్పించు. సర్వమూ నిష్కామంగా నాకు సమర్పించి నీవు ఖాళీ అయిపో. అప్పుడదే నీకు బుద్ధియోగానికి దారితీస్తుంది. మనసులో ఏర్పడిన ఖాళీ అంతా జ్ఞానయోగంతో నిండిపోతుందని భావం. బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్సతతం భవ - అలాటి జ్ఞానయోగ మబ్బితే చాలు. మత్పరః మచ్చిత్తః నేనే జీవిత గమ్యంగా నా స్వరూపమే మనసులో నింపుకొని నిరంతరమూ నాధ్యానంతోనే జీవితం గడపమంటాడు. ఇక్కడ కర్మలన్నీ సన్న్యసించటమంటే చేయకుండా మానేయటమనే గాదు. చేసినా చేయకున్నా ఆత్మ దృష్టితో చూస్తూ ఆత్మ భావనలోనే వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రవిలాపనంచేసి ఆత్మైక దృష్టి నిత్యమూ కాపాడుకొంటూ జీవయాత్ర సాగిస్తూ పోవాలని తాత్పర్యం. అలాగైతేనే అది బుద్ధియోగమని పించుకొంటుంది.
మచ్చిత్త స్సర్వదుర్గాణి - మత్ప్ర సాదా త్తరిష్యసి
అధచేత్త్వ మహంకారా - న్న శ్రో ష్యసి వినంక్ష్యసి - 58
Page 499