#


Index

మోక్ష సన్న్యాస యోగము

కాస్తా చివరకు నిర్గుణమైన జ్ఞానయోగంగా మారుతుంది. అది నిరంతరమూ ఆవర్తమాన మవుతూ పోతే విజాతీయ భావానంతరిత సజాతీయ భావ ప్రవాహ రూపమైన నిష్ఠగా పరిణమిస్తుంది. అదే జీవన్ముక్తావస్థ. అదే జీవిత పరమావధి. పురుషార్థ పరిసమాప్తి. అలాటి చరమానుభవం సిద్ధించాలంటే మొదట కర్మ యోగమూ భక్తియోగమూ రెండింటిలో తగినంత శిక్షణ పొందాలి. అది పునాది తరువాతి జ్ఞానసౌధ నిర్మాణాని కంతటికీ. అదే చెబుతున్నా డిప్పుడు సవిస్తరంగా.

సర్వ కర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయః
మత్ప్రసాదా దవాప్నోతి - శాశ్వతం పదమవ్యయమ్ - 56

  హామీ ఇస్తున్నాడు భగవానుడు భక్తులందరికీ. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః ఎలాటి కర్మలైనా చేస్తూ ఉండు నీవు. ఆఖరుకు ప్రతిషిద్ధ కర్మలైనా పరవా లేదంటారు భాష్యకారులు. వాటివల్ల కలిగే గుణదోషాలేవీ నిన్నంటవు. కారణమేమంటే వాటిని శుద్ధి చేసే దివ్యౌషధం నీలో ఉన్నది. అదేదో గాదు. మద్య్యపాశ్రయః వాసుదేవ స్సర్వమని నన్నే సర్వత్రా దర్శిస్తూ ఉంటే చాలు నీవు. మనసా వచసా వపుషా నన్నే ఆశ్రయించి దినచర్య సాగిస్తూ పోయావంటే మత్ప్రసాదాత్. నా అనుగ్రహానికి పాత్రుడ వవుతావు. దానివల్ల చిత్త ప్రసాదం కలుగుతుంది నీకు. రజస్తమో మాలిన్యం తొలగిపోతుంది. పోతే అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం - దానివల్ల

Page 498

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు