#


Index

మోక్ష సన్న్యాస యోగము

  ఇది ఎలాంటిదంటే ఇప్పుడొక ఘటాన్ని తెచ్చి ఆరుబయట పెట్టావు. అది ఎక్కడ ఉన్నదా ఘటం. ఆకాశంలో. కాని ఘటంలో తొంగి చూస్తే మరలా ఏమి కనపడుతుంది నీకు. ఆకాశమే. ఆకాశంలో ఘటమున్నదా ఇంతకూ ఘటంలో ఆకాశముందా. ఏది చెప్పినా తప్పే. అది ద్వైత దృష్టి. మరేమని చెబితే ఒప్పు. ఆకాశమే ఉంది లోపలా వెలపలా. అసలా ఘటం కూడా అమూర్తమైన ఆకాశమే మూర్తీభవించిన రూపమని చూస్తే అద్వైత దృష్టి. ఇప్పుడిది నీవు గ్రహించావనుకో ఈ సత్యం. అప్పుడు క్రొత్తగా నీ దృష్టి ఆకాశమే ఉందనే భావంలో ప్రవేశించిందా. ఉందని గ్రహించటమే ప్రవేశమా కాదా. గ్రహించినా అది ఆకాశమే. దృష్టి అందులో ప్రవేశించినా అది ఆకాశమే. అలాంటిదే ఈ చిదాకాశ వ్యవహారం కూడా. తదాకార వృత్తితో దాన్ని సర్వత్రా దర్శిస్తున్నా వంటే అందులో నీ దృష్టి ప్రవేశించినట్టే. ఇక క్రొత్తగా ప్రవేశించట మేముంటుంది. ప్రత్యగాత్మ విషయ ప్రత్యయ సంతాన కరణా భినివేశమే ప్రవేశమంటారు భగవత్పాదులు.

  పోతే ప్రస్తుత మిలాటి జ్ఞాన నిష్ఠా రూపమైన అనన్య భక్తియోగ మలవడాలంటే మాటలు గాదు. దానికి మొదట కర్మయోగ మభ్యసించాలి. ఈశ్వరార్పణ బుద్ధితో నిరహంకారంగా సత్కర్మ లాచరించటమే కర్మయోగం. అది పాకానికి వస్తే సగుణ రూపంగా ఈశ్వర ధ్యానం నిరంతరమూ సాగించటం భక్తియోగ మంటారు. అది కూడా పరిపాకానికి వస్తే సగుణం

Page 497

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు