ఒక్కటే. అలాంటప్పుడది లోకంలో పదార్ధాలలాగా ప్రమేయమెలా అయింది జ్ఞానానికి. జ్ఞానం జ్ఞేయం రెండింటినీ వ్యాపించింది గదా. ఆ దృష్టితో అప్రమేయమది కాని వస్తు సిద్ధంగా అప్రమేయమే అయినా దాని జ్ఞానానికది మరలా గోచరిస్తుంటుంది కాబట్టి ఆ దృష్టితో చూస్తే ప్రమేయమే నని చెప్పాలి. మొత్తం మీద సర్వాత్మకమైన తత్త్వమది.
అయితే మరి దాన్ని ఎలా పట్టుకోవాలి ఎలా స్వానుభవానికి తెచ్చుకోవాలని అడిగితే చెబుతున్నాడు. భక్త్యామా మభిజానాతి. అనన్యమైన భక్తితో లేదా అఖండాకార వృత్తితో ఫలానా అని గుర్తించాలి ముందు. అంటే ఒక ఆకాశంలాగా సర్వత్రా పరుచుకొన్నట్టు తన స్వరూపాన్ని చూచుకోవాలి జ్ఞాని మొదట. తతో మాంతత్త్వతో జ్ఞాత్వా అలా ఆ పదార్ధమెలా ఉందో అలా దాని రూపరేఖలు బాగా మనసుకు తెచ్చుకొని ఆ తరువాత విశతే తదనంతరం - దానిలోనే తన మనసును ప్రవేశపెట్టాలి. ఇది ఆత్మ సంస్థం మనః కృత్వా అని ఇంతకు ముందు చెప్పిన దానికి ప్రతిధ్వని. అనంతర మంటున్నా డొక మాట. అంతరం లేనిదేదో అది అనంతరం. అంతరమంటే వ్యవధానం. తేడా. జ్ఞానమూ ప్రవేశమూ రెండూ రెండు వేర్వేరు క్రియలు కావు. జ్ఞానమే ప్రవేశం. ఉన్నది ఆత్మే అయినప్పుడది గుర్తిస్తే చాలు. నీవున్న దక్కడే. అసలది నీవే. ఇక వేరే ప్రవేశించట మేముంది. ఆ తెలుసుకోటమే అందులో ప్రవేశించటం కూడా.
Page 496