పోతే జ్ఞాని అనే నాలుగవ వాడలా కాదు. తనకెప్పుడూ అన్యంగా చూడడా ఈశ్వరతత్త్వాన్ని. అంటే జీవేశ్వర రూపంగా ఉన్నదొకే ఒక చైతన్యమది కేవల మాత్మ స్వరూపమే ననే అద్వైత దర్శనమే అసలైన భక్తి. అదే జ్ఞాన నిష్ఠ. ఇక్కడ భక్తికీ జ్ఞానానికీ తేడా లేదు. కనుకనే ఉత్తమాం భక్తిం జ్ఞాన లక్షణాం చతుర్థీం లభతే. అలాటి జ్ఞాన రూపమైన భక్తి నవలంబిస్తాడు సాధకుడని చాటుతున్నారు భగవత్పాదులు.
భక్త్యామా మభి జానాతి యావాన్ యశ్చాస్మితత్త్వతః
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా- విశతే తదనంతరమ్ - 55
ఈ అసలైన పరమభక్తి ఎలాంటిదో దానివల్ల సాధకుడికి కలిగే ఆ అద్వైత బ్రహ్మానుభవ మెలా ఉంటుందో వర్ణించి చెబుతున్నా డిప్పుడు మహర్షి భక్త్యా మామభి జానాతి. భక్తి అంటే జ్ఞానమని గదా చెప్పాము. ఏమిటా జ్ఞానం. బ్రహ్మాకార వృత్తే జ్ఞానం. జ్ఞానమే ప్రమాణం దేనికైనా. బ్రహ్మాన్ని దర్శించాలంటే బ్రహ్మ జ్ఞానమే ప్రమాణం. అది ప్రమాణమైతే దాని ద్వారా అనుభవానికి వచ్చే బ్రహ్మమే మవుతుంది. ప్రమేయం. ప్రమేయంగాని ప్రమేయం. ఎందుకని. సర్వవ్యాపకమది. జీవజగదీశ్వరులనే తేడా లేకుండా సమస్తమూ వ్యాపించింది. అదే యావాన్ అనే మాట కర్థం. మరి అలా వ్యాపించిన దేది అని అడిగితే యశ్చాస్మి అంటున్నాడు. యశ్చ అంటే అప్పటికి స్వరూపం. యావానంటే దాని విస్తారం. రెండూ
Page 495