పొందిన జ్ఞాని ఎప్పుడూ ప్రసన్నంగా కనిపిస్తుంటాడు. అధ్యాత్మ ప్రసాదం పిలిస్తే పలుకుతుంది వాడికి. అంటే మనసెప్పుడూ ఆత్మకార వృత్తితో నిండి ఉంటుంది. బాహ్యమైనది సర్వమూ ఆత్మదృష్టితోనే చూస్తుంటాడు. ఆత్మ తత్త్వానికి భిన్నంగా ఏదీ కనిపించదు. కాబట్టి నశోచతి నకాంక్షతి. ఒకటి లభిస్తే పొంగి పోవటం. లభించకుంటే దానికోసం పరితపిస్తూ కుంగిపోవట మంటూ ఉండదు. అంతా ఆత్మే అయినప్పుడిక వైకల్యం వైఫల్యమనే తేడా ఎక్కడ ఉంటుంది జ్ఞానికి.
అందుకే సమస్సర్వేషు భూతేషు. ఇంకా ప్రారబ్ధం కొద్దీ ఉపాధి ఉంది కాబట్టి చరా చర పదార్ధాలేవి చూచినా దేనితో వ్యవహరిస్తున్నా దాని స్థానంలో తన స్వరూపాన్నే చూస్తాడు. దాని కష్ట సుఖాలన్నీ తనవి గానే భావిస్తాడు. అది కూడా ఎప్పటికప్పుడు స్వరూపంలోనే లయం చేసుకొంటూ ఆత్మ నిర్విశేషంగానే చూస్తూ పోతాడు ప్రతి ఒక్కటీ. మద్భక్తిం లభతే పరాం. ఇదే భక్తి అంటే. పరమమైన భక్తి ఇది. నాలుగు విధాలని గదా ఇంతకు ముందు పేర్కొన్నాడు భక్తిని. ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ వీరు నలుగురూ భక్తు లేనన్నాడక్కడ. భక్తి అంటే పట్టుకోటమని గదా అర్థం. ఆ అర్థంలో వీరందరూ భగవత్తత్త్వాన్ని ఏదో ఒక విధంగా పట్టుకొన్న వారే. కాని తాము అన్యంగా తాము పట్టుకొన్న దన్యంగా చూస్తూ పట్టుకొంటారు ఆర్తాదులు ముగ్గురూ.
Page 494