#


Index

మోక్ష సన్న్యాస యోగము

మనః స్తిమితతా ఏకాగ్రతా పట్టుదలా ఇవ్వకుండా పక్కకు లాగేయట మొకటి. ఏవో కావవి. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం. మొదటిది అహంకారం. నేను కర్తననే సంకుచిత భావం. అలాటి భావమేర్పడే సరికి ఈ ఫలితం నా కనుకూలించా లది నేనే అనుభవించాలనే పంతం. దానికే బలమని పేరు. ఇచ్ఛా బలమే బలమిక్కడ. దర్పం. దానితో కండ్లకు పొరలు కమ్మి ధర్మం లేదు అధర్మం లేదు. పెద్ద లేదిహితం చెప్పినా నిర్లక్ష్యం చేయటం. కామం క్రోధం. అది రాగద్వేషాలనే ద్వంద్వాలకు బానిసను చేస్తుంది సాధకుణ్ణి. పరిగ్రహం. అందులో దేనిమీద రాగముందో వాడికదంతా పోగు చేసుకొని దగ్గరుంచుకోవాలనే మమకార మేర్పడటం సహజమే. కనుక విముచ్య అలాటి అహం తా మమతలు రెండూ వదిలేసి నిర్మమముడవై శాంతః - అహం మమలెప్పుడు లేవో అప్పుడు నీ మనస్సు స్తిమితంగా శాంతంగా ఉంటుంది కాబట్టి అలాటి శాంత స్వభావ సంపన్నుడవైతే చాలు. బ్రహ్మాభూయాయ కల్పతే. అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మ సాయుజ్యాన్ని నిరాఘాటంగా పొందగల వని హామీ ఇస్తున్నాడు మహర్షి సాధకుడికి.

బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా - స శోచతి న కాంక్షతి
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే నరః - 54

  మరి ఆ బ్రహ్మభావాన్ని పొందిన వాడి వ్యవహారమెలా ఉంటుందని అడిగితే వర్ణిస్తున్నాడు. ఏమని. బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా. బ్రహ్మ భావం

Page 493

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు