ప్రయోగించా డొకటి. నిత్యమని కూడా పేర్కొన్నాడు. అంటే ఏమని తాత్పర్యం. నిత్యగ్రహణం మంత్ర జపాద్యన్య కర్తవ్యాభావ ప్రదర్శనార్ధ మంటారాయన. నిత్యమని చెప్పటం వల్ల మంత్ర జపాదికమైన మిగతా కర్మ సమాధి భక్తి మార్గాలన్నీ కట్టిపెట్టి వాటన్నింటి బదులూ ఈ ఆత్మ విచార మొకటి చేస్తూ దాన్నే చూస్తూపోతే చాలునట. అదే అన్నింటికీ జవాబు చెబుతుందంటారు స్వామివారు. అలా అదే పట్టుకొని కూచోవాలంటే మిగతావి కూడా పాటించాలేమో లేకుంటే ఇది పరిపూర్ణం కాదేమోననే చాపల్యముండవచ్చు. అందుకే చెబుతున్నాడు వైరాగ్యం సముపాశ్రితః మిగతా మార్గాలన్నిటి మీదా విరక్తి చెంది దీనిమీదనే రక్తి పెంచుకోవాలని. ఆ కొమ్మను వదలుకొంటే గాని ఈకొమ్మను గట్టిగా పట్టుకోలేడు. రెండు పడవలలో అడుగుపెట్టి ఎవడూ ప్రయాణం చేయలేడు. ఇదీ మనం గుర్తుంచుకోవలసిన విషయం.
ఇలా సాధనాంతరాలలో తల దూర్చక పోవటమే గాదు వైరాగ్యమంటే. మానసికమైన రాజస తామస భావాలకు కూడా స్వస్తి చెప్పవలసి ఉంటుంది. అదంతా అసుర సంపద. అది రెండు విధాల చెరుపు సాధకుడికి. మిగతా యోగ మంత్ర జపాద్యను ష్ఠానాలు కూడా మోక్షమనే గమ్యాన్ని చేరటానికి స్వతంత్రంగానే తోడ్పడతాయోమో. కాదనటం దేనికవి కూడా అభ్యసిద్దామనే చాపల్యాన్ని కలిగించట మొకటి. జ్ఞాన సాధన చేస్తున్నా దానికి కావలసిన
Page 492