వసతి పట్టుదల ఉన్నవాళ్లలా వెళ్లినా అందరూ ఆ పనే చేయాలనుకో రాదు. మనకు బ్రహ్మ విచారం ముఖ్యం. పదిమందిలో పరిపరివిధాల వ్యాసంగాలలో సాగకపోవచ్చు. కాని మనమున్న ప్రదేశంలోనే అలాటి వ్యాపకాలు పెట్టుకోకుండా మనపాటికి మనం దృఢ బుద్ధితో సాధన చేస్తే కాదన్నదెవరు. ఎవరి పాటికి వారుండ గలిగితే అదే వివిక్తం. ఏకాంతం.
పోతే యత వాక్కాయ మానసః -ఎక్కడ ఉన్నా ఉండు. అది గాదు ప్రధానం. అన్నిటికన్నా ప్రధానమైనది నీ మనస్సూ వాక్కూ శరీరమూ నీచెప్పుచేతల్లో ఉండటం. మన బంగారం మంచిదైతే కమసాలి నెందుకు తప్పు పట్టటం. త్రికరణ శుద్దీ నీవు పాటించగలిగితే వనంలో ఉన్నా భవనంలో ఉన్నా ఒకటే. నీవు దారి తప్పవు. అది చేతగాని వారే ఎక్కడికైనా పోతే నాకు సుఖంగా ఉంటుందని కంప్లెయింటు చేస్తుంటారు.
అంతేకాదు. అన్నిటి కన్నా ముఖ్యమైనది ధ్యానయోగ పరోనిత్యం. ధ్యానమొకటీ యోగమొకటీ ప్రతిక్షణమూ విడవకుండా అభ్యసిస్తూ ఉండాలి. ధ్యానమంటే ఆత్మ స్వరూప చింతనమని యోగమంటే దాని విషయంలోనే ఏకాగ్రత అనీ వ్రాస్తున్నారు భాష్యకారులు. దీన్నిబట్టి పాతం జలయోగం కాదిది అని గ్రహించాలి మనం. జ్ఞాన విజ్ఞానాలని రాజవిద్యా రాజగుహ్యాలని ఇంతకు ముందు ఏది వర్ణిస్తూ వచ్చాడో గీతాచార్యుడదే పరామార్శిస్తున్నాడీ మాటల ద్వారా. అన్నీ పర్యాయ పదాలే. అయితే పర అనే మాట
Page 491