అలాగే దైవవశాత్తూ అవి నివాసించినట్టు లభించక పోయినా లభించి ఎంతో కాలం నీ దగ్గర నిలవక పోయినా ఎక్కడ లేని ద్వేషమూ పెట్టుకోరాదు. వ్యుదస్య. రాగద్వేషాలు రెండూ ప్రబల శత్రువులు. సామ్యస్థితి కవి భంగకరం. వైషమ్యానికి దారితీసి ప్రపంచ వాసన లెక్కువ చేస్తాయవి. కాబట్టి ఏది ప్రాప్తించినా ఏది తొలగిపోయినా నిర్లిప్తమైన ఉదాసీనమైన దృష్టితో వాటి రాకపోకలు గమనిస్తుండాలే గాని వాటిలో పడిపోరాదు. సమత్వం యోగ ఉచ్యతే అని గదా గీతోపదేశం. అసలు బ్రహ్మమే సమమైనది. దాన్ని పట్టుకోవాలని గదా నీవాంఛ. అలాంటప్పుడు నీ దృష్టి విషమమైతే ఎలాగా.
ఈవిధంగా నిషేధ ముఖంగా అలవరుచుకోవలసిన గుణాలన్నీ వర్ణించి ప్రస్తుతం విధిముఖంగా చెబుతున్నాడు మరలా. వివిక్త సేవీ. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి అక్కడ సాధన చేయటం మంచిదంటారు. అలాగే లఘ్వాశీ మితంగా ఆహారం తీసుకోవాలట. వివిక్త ప్రదేశాలలో ఉండటం లఘువుగా భోజనం చేయటం వల్ల అలసత్వమూ నిద్రా ఇలాటి దోషాలు దూరం కావటమూ చిత్త ప్రసాదం - అంటే బుద్ధి ప్రసన్నంగా నిర్మలంగా మారటమూ ఇలాటి లాభాలు కలుగుతాయంటారు భాష్యకారులు. అయితే ఏకాంత మనగానే ఎక్కడో అరణ్యాలకూ పర్వత గుహలకూ వెళ్లి అక్కడ కాపురం చేయాలని ఆయన చెబుతారు. కాని వెళ్లే
Page 490