#


Index

మోక్ష సన్న్యాస యోగము

ప్రసాదిస్తుంది. అదే జీవితానికి కడపటి లక్ష్యం. అంచేత అద్దమెంత శుద్ధి అయితే అంత వస్తువు స్పష్టంగా కనిపించినట్టు - మనస్సు ఎంత శుద్ధి చెందితే అంత గొప్ప అనుభవానికి తోడ్పడుతుంది. ఇప్పుడు సాధకుడు కోరుతున్నది సామాన్యమైనది కాదు. సాక్షాత్తూ బ్రహ్మానుభవం. అలాంటప్పుడు దానికి సాధనమైన అంతఃకరణ మెంత నిర్మలమయి ప్రకాశించాలో ఆలోచించండి. అందుకే బుద్ధ్యావిశుద్ధయా యుక్తః అంటున్నాడు. బుద్ధి విశుద్ధం కావాలట. అంటే రాజస తామస భావాలేవీ రాగూడదా మనస్సుకు. వస్తే అవి ఆవరణ విక్షేపాలకు గురి చేస్తాయి బుద్ధిని. కేవల సాత్త్విక గుణంతో నిండిపోవాలి. సత్త్వం నిర్మలమూ ప్రకాశకమూ అనామయమని గదా ముందు వర్ణించారు. సత్త్వాత్సంజాయతే జ్ఞానమని కూడా పేర్కొన్నారు. కనుక జ్ఞానార్జనకు మూలం చిత్త శుద్ధి.

  తరువాత రెండవది ధృత్యా త్మానం నియమ్య. ఆత్మ అంటే ఇక్కడ కార్యకరణ సంఘాతం. ఈ శరీరమూ ప్రాణమూ ఇంద్రియాలూ ఇవి. వీటి నిటూ అటూ చెదిరిపోకుండా అదుపులో పెట్టుకోవాలి. పెట్టవలసిందేది. ధృత్యా. ధైర్యగుణం. దేనికైనా నియామకం మానవుడి ధైర్యమే. ధైర్యం లేకపోతే శరీరంలో మనఃప్రాణాల దగ్గరి నుంచీ ఏదీ చెప్పిన మాట వినదు. సరియైన మార్గంలో నడవదు. నడవకుంటే గమ్యం చేరలేము. అంచేత అపమార్గంలో ప్రవర్తించకుండా గమ్యాభిముఖంగా చక్కని పథంలో సాగిపోయేలాగా ఇంద్రియాలకు శిక్షణ ఇచ్చుకోవాలి సాధకుడు.

Page 488

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు