#


Index

మోక్ష సన్న్యాస యోగము

దీనికంతా మూలకారణం మరేదీ కాదని జాలిపడతా రాయన. మరి ఆసాధన మార్గంలో అడ్డుపడే బుద్ధి మాంద్యమెలా తొలగించుకోవాలో దాన్ని మనకు బోధిస్తున్నాడు వ్యాసభగవానుడు వినండి.

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో - ధృత్యా త్మానం నియమ్యచ
శబ్దాదీన్ విషయాం స్యక్త్వా రాగద్వేషొ వ్యుదస్యచ - 51

వివిక్త సేవీ లఘ్వాశీ - యత వాక్కాయ మానసః
ధ్యాన యోగ పరోనిత్యం- వైరాగ్యం సముపాశ్రితః - 52

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం
విముచ్య నిర్మమ శ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే - 53

  మానవుడి కున్న సాధన సామగ్రిలో అన్నిటికన్నా మొట్టమొదటిదీ ముఖ్యమైనదీ బుద్ధి. బుద్ధి జీవుడని పేరు మానవుడికి. మనసు లేకుంటే వాడు మానవుడే కాదు. పశుపక్ష్యాదులతో సమానం. కనుక ఏ సాధన చేయాలన్నా మొదట మన స్సంకల్పాన్ని బట్టి ఉంటుంది. దానితో మొదలవుతుంది. చివరకు దానితోనే సమాప్తమవుతుంది కూడా. మనసే గదా ఏదనుభవించినా అనుభవించవలసింది. అనుభవమే గదా ఆఖరు. అది లౌకికమైతే అర్థకామాల అనుభవమే. ఆముష్మిక మైతే ధర్మానుభవమే. పోతే ఆధ్యాత్మికమై నప్పుడే జ్ఞానోదయం ద్వారా మోక్షానుభవాన్ని

Page 487

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు