మెడకాయ మీద తలకాయ ఉన్న వాడెవడూ ఆ మాట అనడు. అంతవరకూ గారంటీయే గదా. ఎటు వచ్చీ నీ జ్ఞానమే నీవు లేదంటున్నావు. జ్ఞానంతోనే గదా అవన్నీ చూచి చెబుతున్నా వున్నాయని. కనిపిస్తున్నాయని. అలాంటప్పుడు జ్ఞానంతో చూచిన జ్ఞేయ ప్రపంచముండి దాన్ని చూపే జ్ఞానమెలా లేకుండా పోయింది నీకు. ఏమైనా అర్థముందా. వెలుగులో వస్తువులు కనిపిస్తున్నాయే గాని వాటిని చూపే వెలుగు లేదన్నట్టున్నదీ మాట. ఇది ఎలాటిదంటే నాకు కండ్లు లేవు కాని పదార్ధాలు కనిపిస్తున్నాయని చెప్పటం లాంటి దంటారు భగవత్పాదులు. దీనికే స్వవచో వ్యాఘాతమని పేరు శాస్త్రంలో. నీ అనుభవానికి నీవే అడ్డు తగిలే మాట Self Contradictory statement జిహ్వామే నాస్తి జననీమే వంధ్యా అని ఉదాహరణ మిస్తారాయన దీనికి. నాకు నాలుక లేదని మాటాడుతున్నాడట ఒకడు. మా తల్లి గొడ్రా లంటున్నాడట మరొకడు. వాళ్ళిద్దరూ ఎంత మేధావంతులో అంత మేధావులే ఇప్పుడీ పేర్కొన్న ద్వైత విద్యా పారంగతులందరూ. జ్ఞేయ ప్రపంచాన్ని ఒక పక్క చూస్తూ చేస్తూనే జ్ఞాన స్వరూపమైన ఆత్మ ఎక్కడుంది అని అడిగేవాళ్ల నేమ నాలిక. స్వరూపమే అయినప్పుడది అందుకొనేదెలా అని అడిగే ప్రబుద్ధుల నంత కన్నా ఏమనాలని ప్రశ్నిస్తా రాచార్యుల వారు. కాబట్టి సూక్ష్మం తెలుసుకోలేని బుద్ధి మాంద్యమే
Page 486