#


Index

మోక్ష సన్న్యాస యోగము

పోయి నీకు నీవే కనిపిస్తావు. మబ్బులన్నీ విరిసిపోతే నిర్మలమైన ఆకాశం కనిపించినట్టు. మంచిచెడ్డ ఆలోచనలన్నీ నా జ్ఞానమనే సాగరంలో నుంచి పొంగిన తరంగ బుద్బుద ఫేనాదులే గదా అని చూస్తే ఏమవుతుంది. జ్ఞాన వృత్తులన్నీ కరిగిపోయి కేవలం జ్ఞానమే శేషిస్తుంది. అదే ఆత్మ. అదే నా స్వరూపం. నా జ్ఞానమని కూడా కాదు. నేనే నా జ్ఞానం. మబ్బులు లేని ఆకాశంలాగా వృత్తులు లేని చిదాకాశం నా స్వరూపంగా అనుభవానికి రాగలదు. ఇందులో జ్ఞానంగా నా స్వరూపం సిద్ధమే గనుక అందులో నేను చేయవలసిన ప్రయత్నం లేదు. దీని కడ్డు తగిలే ఆలోచనలన్నీ దానికన్నా విలక్షణంగా లేవని భావించటంలోనే చేయవలసిన యత్నమంతా నంటారు భగవత్పాదులు.

  అయినా లోకంలో కొందరు పండితులూ మిగతా పామరులైన లోకులూ ఆత్మజ్ఞాన మెప్పటికీ దుర్లభమని వాదోపవాదాలతో కాలక్షేపం చేస్తున్నారు. దీనికి కారణం వీరందరికీ సద్గురు సంప్రదాయం లేదు. వేదాంత శాస్త్రాధ్యయనం చక్కగా చేయలేదు. సరియైన ప్రమాణాలేవో వాటిలో ఏమాత్రమూ కృషి చేసిన వారు కారు. దానికి తోడు అత్యంత బహిర్విషయాసక్త బుద్ధులు వీరు. ఇలాటి అవలక్షణా లున్నప్పుడు సలక్షణమైన ఆత్మతత్త్వ మెలా దర్శనమిస్తుంది వీరికి. అంచేత ఇవన్నీ అడ్డు తొలగించుకొని పరిశుద్ధమైన ఆత్మాకార వృత్తి ఏర్పడితే గాని ఆత్మను పట్టుకోలేరు.

Page 484

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు