#


Index

మోక్ష సన్న్యాస యోగము

  అలాగే జరిగిందిప్పుడు ఆత్మ విషయంలో. ఆత్మ చైతన్య ప్రకాశమే బుద్ధీంద్రియ శరీరాద్యుపాధుల మీద పడి వీటన్నిటినీ ఉన్నాయని స్ఫురిస్తున్నాయని మనకు చూపుతున్నది. అలా చూపుతుంటే మనమేమి చేస్తున్నాము. ఈ బుద్ధీంద్రియాదులే సత్యమని భావించి వీటితో వ్యవహరిస్తూ ఇవి ఏ వెలుగులో ఇలా భాసిస్తున్నాయో ఆ జ్ఞాన ప్రకాశాన్ని పూర్తిగా మరచిపోయాము. అలా మరచిపోయిన బాపతే చార్వాకుడిలాంటి నాస్తికులూ భౌతికవాదులూ విజ్ఞానవాదులైన బౌద్ధులూ చివరకీ ఈశ్వర కారణవాదులైన ఆస్తికులూ ఉపాసకులూ యోగులూ మొదలైన ద్వైత వాదులందరూ కూడా. వీరందరూ ఆ అఖండమైన చైతన్య ప్రకాశాన్ని గుర్తించక అందులో వెలిగే స్థావర జంగమాది పదార్ధాలనే పట్టుకొని అక్కడి కాగిపోతున్నారు. అదే సత్యమని భ్రమపడుతున్నారు. సత్యమేదో తెలిస్తే గాని ఇవి దాని ఆ భాసలని గమనించలేరు. అవకాశం లేదు.

  అందుకే బ్రహ్మ విజ్ఞానం కోసం ప్రయత్నించమని చెప్పదు శాస్త్రం. అది నీ స్వరూపమే అయినప్పుడిక ప్రయత్నం దేనికి. ప్రయత్నిస్తే అది రోదసీ రేఖలాగా నీకు దూరమయి పోతుంది. అయితే దాన్ని గ్రహించట మెలాగా. దానిమీద అనవసరంగా నీవారోపించిన నామరూపాది అనాత్మ భావాలన్నింటినీ కాదు కానని త్రోసిపుచ్చటమే దాన్ని పట్టుకొనే మార్గం. ఇది నేను కాదది నేను కానని నిరాకరిస్తే చివరకన్నీ కనిపించకుండా

Page 483

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు