#


Index

మోక్ష సన్న్యాస యోగము

వినమంటాడు. ఏమిటది. నిష్ఠా జ్ఞానస్య యాపరా. ఏదో గాదు. పరమమైన జ్ఞాన నిష్ఠ అది.

  నిష్ఠ అంటే పర్యవసానం పరిసమాప్తి. Culmination దేనికి. జ్ఞానానికి. దేనికి చెందిన జ్ఞానం. ఆత్మ స్వరూపానికి. ఆత్మకాకార మున్నదా. లేదు. దాన్ని గ్రహించే జ్ఞానానికున్నదా ఆకారం. దానికీ లేదు. అప్పటికాత్మా నిరాకారమే అయి దాన్ని తెలిపే జ్ఞానమూ నిరాకారమే అయితే ఈ జ్ఞానమా ఆత్మనెలా తెలుపుతుది మనకు. దీనిద్వారా దాన్ని మనమెలా అందుకోగలమని ప్రశ్న వస్తుంది. ఇది భగవత్పాదులకే వచ్చిందీ సందేహం. దానికాయన ఇచ్చిన సమాధాన మొక్కటే. నిరాకారమైనా ఆకాశాన్ని చూస్తున్నావా లేదా బాహ్యంగా. అలాగే నిరాకారమైన చిదాకాశాన్ని చూడటానికేమి ఇబ్బంది. ఎన్ని లేవు నీవు చూచే నిరాకారాలు. సుఖం దుఃఖం భయం ధైర్యమనే భావాలకు ఒక ఆకారమంటూ లేదు గదా. అవి నీ అనుభవానికెలా వస్తున్నాయి. దీన్నిబట్టి ఒక విశిష్టమైన ఆకారముంటేనే తప్ప మానవుడి జ్ఞానం దేన్నీ గ్రహించ లేదనే మాట చెల్లదు. మనసు పట్టుకోటాని కాకారమే ఉండనక్కర లేదు పదార్ధానికి. లేకున్నా భావించగలదది. దాని కలాటి అద్భుతమైన శక్తి ఉంది.

  దానితో ఆత్మను కూడా భావించగలదది. ఎలాగా అని అడుగు తావేమో. అత్యంత నిర్మలమూ అతిస్వచ్ఛమూ అతి సూక్ష్మమూ ఇలాటి

Page 481

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు