చేయలేవు. కర్తృత్వం ప్రకృతి గుణాల కప్పచెప్పి సాక్షిగా మాత్రమే మిగిలిపోవాలి నీవు. అలాగే జితాత్మా. నీ బుద్ధినీ చెప్పుచేతల్లో మెలగాలి. విగత స్పృహః దేనిమీద ఏ మాత్రమభిలాష పెట్టుకొన్నా అలా ఉండలేవు. కనుక అన్ని చాపల్యాలూ జయించాలి నీవు. ఇలా నీ ఉపాధి వర్గమంతా నీ అదుపులో ఉన్నప్పుడే అనాత్మను కూడా ఆత్మగా దర్శించే నిష్ఠకు నోచుకొంటావు. మొదట జ్ఞానార్జన. తరువాత జ్ఞాన నిష్ఠ - ఇదే సాధకుడి కర్తవ్యం.
సిద్ధిం ప్రాప్తో యధా బ్రహ్మ - తథాప్నోతి నిబోధమే
సమాసేనైవ కౌంతేయ- నిష్ఠా జ్ఞాన స్యయా పరా - 50
అవి రెండూ ఎలా ఏర్పడుతాయో దాని భూమికా క్రమం వర్ణించే ముందు అవి ఏమిటో వాటి స్వరూపాన్ని నిర్దేశిస్తున్నాడు. సిద్ధిం ప్రాప్తః సిద్ధి అంటే జ్ఞాన నిష్ఠా యోగ్యతే ఇక్కడ సిద్ధి. అది ఈశ్వరార్పణ బుద్ధితో విధ్యుక్త కర్మ లాచరిస్తూ పోతే తన్నిమిత్తంగా శరీర మనః ప్రాణేంద్రియాలకు కలిగే నైర్మల్యం. చిత్తశుద్ధే సిద్ధి. దానివల్ల ఆత్మజ్ఞాన మనేది ఉదయించి అదే చివరకు నిష్ఠగా మారుతుంది. యధా బ్రహ్మతధా ప్నోతి - అప్పుడే బ్రహ్మానుభవం మానవుడికి. కర్మయోగం చిత్తశుద్ధినిస్తే అది జ్ఞానానికి తోడ్పడితే బ్రహ్మాకార వృత్తి రూపమైన ఆ జ్ఞానం బ్రహ్మనుభవంలోనే పర్యవసానం చెందుతుంది. ఇదీ వరస. నిబోధ మే. అదే చెబుతున్నాను.
Page 480