#


Index

మోక్ష సన్న్యాస యోగము

దాని విభూతిగా దర్శిస్తూ పోవటమే. అది ప్రపంచాన్ని చూస్తున్నప్పుడే చేయాలా సాధన. చూడకుండా కాదు. ఒకవేళ ఎక్కడో ఏకాంత ప్రదేశానికి దనుకోరాదు. వెళ్లి కూచుంటే సరిపోతుం దనుకోరాదు. గృహంలో ఉంటే సరిపో అక్కడైనా ఇక్కడైనా ఎక్కడా నీవు ప్రపంచాన్ని తప్పించుకోలేవు. తప్పించుకోటం కాదప్పటికి సన్న్యాసం. అనాత్మ ప్రపంచాన్ని ఆత్మకు విజాతీయంగా గాక సజాతీయంగా మార్చుకొని చూడటం. దృష్టిలో ఉండాలి గాని అది సృష్టిలో గాదు. సృష్టి అంతా అసలాత్మ స్వరూపమే. దృష్టి మాత్రమే దాన్ని అనాత్మగా చూస్తున్నది. అలాకాక అది కూడా ఆత్మరూపంగా దర్శించటమే గాని వదిలేసి పోవాలనుకోటం సన్న్యాసం కాదు.

  కాబట్టి సన్న్యాసేనాధి గచ్ఛతి. నైష్యర్మ్య రూపమైన సిద్ధి సన్న్యాసం వల్ల లభిస్తుందనే మాట కర్థం జ్ఞాన నిష్ఠ అనేది ఆత్మా నాత్మలు రెండూ ఆత్మైక బుద్ధితో చూడటమని. అప్పుడు కర్మ చేసినా చేయకున్నా పరవాలేదు. ఆత్మ చేయకున్నా ఆత్మే. చేయకుంటే స్వరూపం. చేస్తే విభూతి. అందుకే కర్మణ్య కర్మ అని ఇంతకు పూర్వమే ఈ సాధన రహస్యం వెల్లడించింది గీత. అయితే అలాటి జ్ఞాననిష్ఠ అలవడాలంటే దానికి పూర్వ రంగ మొకటున్నది. అదే చెబుతున్నాడు. ఆసక్త బుద్ధి స్సర్వత్ర. జీవితంలో ఏదిచేసినా అది నిర్లిప్తమైన భావంతో చేయాలి. కర్త ననుకొంటే అలా

Page 479

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు