జ్ఞానమంటే ఏ జ్ఞానం. ఆత్మ జ్ఞానం. తానూ తాను చూచే సమస్తమూ ఆత్మ స్వరూపమే జ్ఞానికి. అది నిరాకారమూ వ్యాపకమూ అచలమూ. అప్పుడిక కర్మ ఎలా చేయగలడు జ్ఞాని. అయితే కర్మలు లేవన్నారు గదా అని సన్యసించి ఎక్కడికో పరుగెత్తి పోవాలని గాదు మరలా. శాస్త్రోక్త కర్మలు మాత్రమే లేనిది. ప్రారబ్ధ కర్మ మాత్రం తప్పదు. శరీరమున్నంత వరకూ ఉంటుందది. కాషాయాలు కట్టుకొని పరుగెత్తే వాడికీ ఉంటుంది. గృహస్థుడికీ ఉంటుంది. వీరిద్దరూ జ్ఞానులే అయితే మాత్ర మింట్లో ఉన్నా పరవాలేదు. పరుగెత్తినా కొత్తగా ఒరిగేది లేదు. సన్న్యాస మనేది మానసికమైన దృష్టి. భౌతికమైన చర్య గాదు. దృష్టి బ్రహ్మాకారంగా మారిపోతే ఆదృష్టితో ఎక్కడ ఉన్నా ఒకటే. అది వస్తుతః సన్న్యాసమే.
అయితే ఒక్క మాట. శాస్త్రం నాలుగా శ్రమాలెందుకు చెప్పింది. గృహీ భూత్వా వనీ భవేత్. వనీ భూత్వా ప్రవ్రజేత్తని ఎందుకన్నది. అది సాధకుడికి శిక్షణ ఇవ్వటానికి చెప్పిన మాట. మరీ ఇంట్లోనే కూచొని అంతా బ్రహ్మాకారంగా దర్శించాలంటే అంత సుకరం కాదది. ఎన్నో తాను నిర్వర్తించవలసిన విధులుంటాయి Commitments గృహస్థుడికి. సన్న్యాసికైతే ఆ గొడవ ఉండదు. అందుకోసం సన్న్యాసం విధించారు. అది కూడా ఆశ్రమ సన్న్యాసమే సుమా. పరమార్ధ సన్న్యాసం కాదు. పరమార్థ సన్న్యాసం సర్వాత్మ భావనతో అనాత్మ రూపమైన సంసారాన్ని
Page 478