కాని ఇది కేవల మా భాసే గనుక వస్తు దృష్టితో వీడంత కంతకు ముందుకు సాగిపో గలిగితే ఏ భేదమూ కానరాదు.
అలా సాగిపోయే విధానమే వర్ణిస్తున్నది గీత. ఏమని. స్వకర్మణా త మభ్యర్బ్య తమ తమ వ్యాపారాలూ వ్యవహారాలూ వదలకుండానే తమ జీవిత లక్ష్యమైన ఆ భగవత్తత్త్వాన్ని సేవిస్తూ పోవాలి. ఎవడు. ఈ వ్యష్టి రూపుడైన జీవుడు. వీడే నరుడని పేర్కొన్నది. సమష్టి రూపుడైన నారాయణుడి స్థాయి నందుకో గలడు వీడు. అభ్యర్చన అనేదే ఆ అందుకొనే మార్గం. తమలో గుప్తమై ఉన్న నారాయణత్వాన్ని స్మరిస్తూ పోవటమే అభ్యర్చన అంటే. స్మరించటమంటే దాని లక్షణాలు మనసుకు తెచ్చుకోటం. అవి రెండే. ఒకటి మనం చూస్తున్న చరా చర పదార్ధాలన్నీ అందులో నుంచే వచ్చాయి దాని ఆభాసే ఇవి అనే చూపొకటి. రెండవది ఈ ఆభాసనంతా ప్రతి అణువూ లోపలా వెలపలా అదే వ్యాపించి ఉన్నదనే భావన. ఈ రెండు చూపులూ ఉంటే సిద్ధిం విందతి మానవః - ప్రతి మానవుడూ వాడే వర్ణం వాడైనా సిద్ధి తప్పకుండా పొందగలడు. సందేహం లేదు. సిద్ధి అంటే మోక్షమే కానక్కర లేదు. సత్త్వ శుద్ధి అయినా సిద్ధే Attainment.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వభావ నియతం కర్మ - కుర్వన్నా ప్నోతి కిల్బిషమ్ - 47
Page 474