#


Index

మోక్ష సన్న్యాస యోగము

అందరూ సమానమే. సమోహం సర్వభూతేషు - మమవర్త్మా నువర్తంతే మనుష్యాః అనే మాట లొక్కసారి మనసుకు తెచ్చుకొని చూడండి. అర్థమవుతుంది. భగవత్తత్త్వం మీద దృష్టి లేనప్పుడే మానవులలో వైషమ్యం. అది ఉంటే చాలు. అన్నీ విభేదాలూ అక్కడికి సమసిపోతాయి.

యతః ప్రవృత్తి ర్భూతానాం - యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య- సిద్ధిం విందతి మానవః -46

  మరి ఆ దృష్టి అన్నారే అది ఎలా ఉంటుందని అడిగితే ఏకరువు పెడుతున్నాడు. యతః ప్రవృత్తి ర్భూతానాం. ఏ భగవ త్స్వరూపం నుంచి ఈ సమస్త భూతాలూ అవి చేతనాలే కావచ్చు. అచేతనాలే కావచ్చు. సృష్టి అయి బయటికి వస్తున్నాయో. సచ్చిత్తులే నామరూపాలనే వేషాలు వేసుకొని చిత్ర విచిత్రంగా భాసిస్తున్నాయో అని అర్థం. అలాగే యేన సర్వమిదం తతం. అలా తనలో నుంచి తన ఆభాసగా కనిపిస్తున్న ఈ సమస్త ప్రపంచాన్నీ మరలా ఏ తత్త్వమైతే సామాన్య రూపంగా వ్యాపించి ఉన్నదో. విశేషాలెప్పుడూ తమ పాటికి తాము బ్రతకలేవు. సామాన్యం నుంచే రావాలవి. సామాన్యాన్ని విడవకుండా కనిపిస్తుండాలి. చివరకు సామాన్యంగానే మారిపోవాలి. కనుక ఆదిమధ్యావసానాల్లో అప్పటికున్నది సామాన్యమైన పరమాత్మ తత్త్వమే. అదే జీవాత్మగా భాసిస్తున్నది ప్రతి వాడి శరీరంలో. ఈ జీవ భావంలోనే వచ్చి పడ్డాయి వర్ణాశ్రమాది భేదాలన్నీ.

Page 473

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు