అంతేకాదు. తస్యకర్తారమపి మాం విద్యకర్తారమని మరొక ఒళ్లు జలదరించే మాట బయట పెట్టాడు పరమాత్మ. అంటే ఏమన్న మాట. ఇది నిజంగా పరమాత్మ సృష్టి అనుకొంటున్నారేమో. కాదు. మానవుడి దృష్టే సుమా. ఆభాసే గాని ఇది వాస్తవం కాదు. ఆభాస అంతా సంకేతమే. సంకేతం చేసే పనేమిటి. ఒక సత్యాన్ని మనకు బయటపెట్టటమే. ఏమిటా సత్యమిక్కడ. అది ఏమిటో ఇంతకు ముందే మేము వివరించి చెప్పాము. బ్రాహ్మణుడంటే మానవుడి మనస్సు - క్షత్రియుడంటే వాడి ప్రాణం. వైశ్యుడంటే ఇంద్రియ వర్గం - శూద్రుడంటే వాడి దేహమని అలా భావిస్తే చాలు. దేహేంద్రియాలు ప్రాణాన్ని దగ్గర పెట్టుకొంటే ప్రాణం మనస్సు కాలోచన ఇస్తే - అది బ్రహ్మాకార వృత్తి నవలంబించి చివరకా వృత్తి ద్వారా బ్రహ్మను భవం సంపాదించటమే జీవిత లక్ష్యమని దీని అంతరార్థం. అదే శరీరమాద్యంఖలు ధర్మ సాధనమని చెప్పే మాట కర్థం. అప్పటి కన్ని వర్ణాలూ కలిసి ఏక వర్ణంగా మారి ఆ ఏకైకమైన ఆత్మ తత్త్వంలో పర్యవసానం చెందటమే పరమార్ధ మన్న మాట.
స్వేస్వే కర్మ ణ్యభిరత - స్సంసిద్ధిం లభతే నరః
స్సకర్మ నిరత స్సిద్ధిం - యధా విందతి తచ్ఛృణు - 45
అలాటి పరమార్ధమేమిటో దాన్ని ఈ నాలుగు వర్ణాల వారు సమానంగా అందుకొనే మార్గమేమిటో బయట పెడుతున్నా డిప్పుడు. ఎవడే
Page 471