#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఉంటుంది కాబట్టి సహజంగా వ్యాపకత్వ ముంటుంది వైశ్యుడికి. లేకుంటే వ్యాపార వ్యవసాయాదులు చేయలేడు.

  అలాగే శూద్రుడికి తమో గుణ మెక్కువ కాబట్టి పరిచర్యాత్మకం కర్మ. ఒకరికి పరిచర్య చేయటమే వాడి వృత్తి. శుశ్రూషా స్వభావమని వ్రాశారు భగవత్పాదులు. శుశ్రూష అంటే రెండర్థాలున్నాయా శబ్దానికి. అది సేవ అయినా కావచ్చు. ఒకరు తమ కేదైనా బోధిస్తే వినే స్వభావమైనా కావచ్చు. ఏదైనా మంచిదే. పరిప్రశ్నేన సేవయా అనే గీతా వాక్యం గుర్తు వస్తున్నది. జ్ఞానార్జన కది చాలా మంచి మార్గం.

  ఇప్పుడీ వర్ణాలూ వాటికి తగిన వృత్తులూ నియతంగా ఉన్నాయని అవి ఎప్పటికీ మారవు అలాగే ఉంటాయని గాదు మనమర్ధం చేసుకోవలసింది. కేవలం వారి వారి స్వభావాలను బట్టి వారి ప్రవృత్తిని బట్టి వర్ణించినదే ఇదంతా. అంచేత తమస్సును వదిలేసి రజస్సును రజస్సును వదిలేసి సత్త్వగుణాన్ని అలవరుచుకొంటూ పోతే అంతకంతకు శూద్రత్వం మంచి మానవుడు బ్రాహ్మణత్వాన్ని అందుకోవచ్చు. అలాగే సత్త్వం నుంచి తమస్సు వరకూ పడిపోతే ఆ మానవుడే బ్రాహ్మణత్వం కోలుపోయి శూద్ర స్థాయికి దిగజారుతాడని భావించవచ్చు. వ్యవస్థితంకాదీ పర్ణ విభాగం. పరిణామశీలం. అందుకే గుణ కర్మ విభాగశః వారి వారి గుణకర్మలను బట్టి చేసిన విభాగమేనని భగవద్గీత ముందే చాటి చెప్పింది.

Page 470

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు